రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకింత తొంద‌ర‌ప‌డ్డారా?  బీజేపీ విష‌యంలో...ఆయ‌న లెక్కలు త‌ప్పుతున్నాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తాను బీజేపీ ట్రాప్‌లో పడనంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ వెంటనే స్పందించింది. రజనీకాంత్ తమ పార్టీలో చేరుతున్నట్లు తామెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేసింది. ఆ రకమైన ప్రచారం కూడా తాము కోరుకోలేదని తెలిపింది.గోవాలో జరిగే 50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియాలో రజనీకాంత్‌కు ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు ఇవ్వబోతున్నట్లు ఇటీవలే కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోడీ సమక్షంలో త్వరలోనే బీజేపీలో చేరుతున్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి. దీంతో ఆ ప్రచారాన్ని సూపర్ స్టార్ ఖండించారు. రజనీ వ్యాఖ్యలతో బీజేపీ అప్రమత్తమైంది. రజనీకాంత్ బీజేపీలో చేరారని కానీ, చేర‌బోతున్నారని కానీ ఎప్పుడూ తామెప్పుడూ చెప్పలేదని ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన‌ కార్యదర్శి మురళీధర్ రావు చెప్పారు. 


భారతీయ జనతా పార్టీలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేర‌బోతున్నారంటూ...త‌న కేంద్రంగా జ‌రుగుతున్న ప్రచారంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే తమిళులకు ఆరాధ్య కవి తిరువళ్లువర్ విగ్రహానికి ఆ పార్టీ రంగులు వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తిరువళ్లువర్ లాగే తనపై కూడా బీజేపీ పెయింట్ వేయాలని చూస్తోందన్నారు. తాను ఆ పార్టీలో చేరుతున్నానని జరుగుతున్న ప్రచారం అబద్ధమని చెప్పారు రజనీకాంత్. తిరువళ్లువర్‌ కానీ, తాను కానీ బీజేపీ ట్రాప్‌లో పడేదిలేదని ఆయన స్పష్టం చేశారు. ‘బీజేపీ కాషాయ రంగు పులిమే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే తిరువళ్లువర్‌కు ఆ రంగు వేశారు. ఇప్పుడు నన్ను కూడా ఆ ట్రాప్‌లోకి లాగాలని చూస్తున్నారు. అది జరగదు’ అంటూ రజనీకాంత్ కామెంట్ చేశారు.


ర‌జ‌నీ కామెంట్ పెద్ద ఎత్తున వైర‌ల్ అయిన నేప‌థ్యంలో జాతీయ ప్ర‌ధాన‌ కార్యదర్శి మురళీధర్ రావు మీడియాతో మాట్లాడుతూ...ఈ రకమైన గాలి ప్రచారాలు బీజేపీకి ఇష్టం ఉండదని స్పష్టం చేశారు. ర‌జనీ త‌నంత తానుగా ప్ర‌చారాన్ని ఖండించార‌ని పేర్కొన్నారు. తమ పార్టీ తమిళనాడులో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలపై ఫోకస్ పెట్టి పని చేస్తోందని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: