ఆ చెట్టు కింద నిలబడితే గుండెపోటు ఖాయం. ఆ చెట్టు ఘాటైన సువాసన పీల్చితే శ్వాసకోస వ్యాధులు, అలర్జీ గ్యారంటీ. ఇలా ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న చెట్టును వెతికి మరీ నరికేస్తున్నారు. ఈ  ఆకుపచ్చని చెట్లను చూడగానే స్వచ్చమైన గాలిని మనసారా పీల్చుకోవచ్చు అని భావిస్తాం. పచ్చగా ఉంది కదా అని  చెట్టు కిందకు వెళ్లి కూర్చుంటే తిప్పలు తప్పవంటున్నారు డాక్టర్లు, శాస్త్రవేత్తలు.


పచ్చని కోనసీమలో ఏడాకులపాల చెట్లు విషం చిమ్ముతున్నాయి. గుబురుగా పెరుగుతూ గుబులు రేపుతుంది.  ఏపుగా పెరిగి,  విరబూసిన పువ్వులతో  కనువిందు కలిగిస్తున్న ఏడాకుల పాల చెట్లు  ఘాటైన సువాసనలు వెదజల్లుతూ.. శ్వాసకోశ వ్యాధులతో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. రావులపాలెం నుంచి  అమలాపురం  వరకు రోడ్డు ప్రక్కన ఏడాకులపాల చెట్లు విరివిగా ఉన్నాయి. ఒకొక్క కొమ్మకు ఏడు ఆకులు ఉండటంతో వీటిని ఏడాకులపాల చెట్లుగా పిలుస్తారు. ఈ చెట్టు చక్కని నీడను ఇస్తుందని  పెంచుకోవడానికి అందరూ ఎంతో ఇష్టపడతారు. అందుకే  ఎక్కువ చోట్ల ఈ ఏడాకులపాల చెట్లును విరివిగా పెంచారు.  


ఈ చెట్లు  దగ్గర నిలబడితే ఒక రకమైన  ఘాటైన  సువాసన  వెదజల్లుతుంది. ఏడాకులపాల చెట్లు పువ్వులు సువాసన పీల్చితే  శ్వాసకోశ వ్యాధులు, గుండెపోటులు వస్తున్నాయని  ప్రచారం జరుగుతోంది. దీంతో  కోనసీమతో పాటు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఏడాకులపాల చెట్లు నరికి వేస్తున్నారు. ఆరోగ్యానికి హాని చేస్తాయని నమ్ముతున్న ప్రజలు ఈ చెట్టును దరిదాపుల్లో ఉంచడం లేదు. ఈ చెట్లను ఎక్కడిక్కడా తొలగిస్తున్నారు. 


చలికాలం సీజన్‌లో ఈ చెట్టు  కొమ్మలకు ఉన్న పుష్పాలు అన్నీ ఒకే సారి పుష్పిస్తాయి. ఏడాకుల పాల చెట్ల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇవి ప్రమాదరకమని తెలియక నాటడంతో పెరిగాయి. పుప్పొడి రేణువులతో మనుషులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. లక్షలాది పుప్పొడి రేణువులు గాలిలో కలిసిపోతాయి. వాటిని పీల్చడం వల్ల మనుషులకు అలర్జీ, అస్తమా, కళ్లుమంటలు వస్తాయి. అంతేగాకుండా ఊపిరితిత్తులకు కూడా ఎఫెక్ట్‌ అవుతుంది. ఇప్పటికే ఈ ఏడాకుల పాల చెట్లను ఢిల్లీ లాంటి నగరాల్లో తొలగిస్తున్నారు. ఈ చెట్టుకు ఏడు ఆకులు ఉంటాయి. ఏడు అనేది అశుభానికి సూచిక అని ప్రజలు ఈ చెట్లను కొట్టేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: