టీడీపీ నేతల వలసల పర్వం ఏపీలో కొనసాగుతోంది. బీజేపీ, వైఎస్ఆర్సీపీల్లో ఇప్పటికే  చాల మంది  నేతలు  చేరగా.. తాజాగా టీడీపీ నుంచి మరో వికెట్ పడింది. టీడీపీ అధికార ప్రతినిధిగా టీవీ డిబేట్లలో పాల్గొన్న సాధినేని యామిని టీడీపీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన ఆమె.. టీడీపీ అధినేతపై ప్రశంసలు గుప్పించారు. స్వదస్తూరితో బాబుకు లేఖ రాసిన ఆమె.. చంద్రబాబు నాయకత్వంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నానన్నారు.దింతో  టీడీపీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు .


యామిని చంద్రబాబు గురించి చాల గొప్పగా చెప్పుకొచ్చింది ...అదేమిటంటే  తన రాజీనామా లేఖలో నాయకుడికి ఉండాల్సిన ఓర్పు, చాణక్యత, ప్రజల పట్ల అభిమానం.. ఇవన్నీ బాబు నుంచి నేర్చుకొని నాయకురాలిగా తనను తాను మలుచుకున్నానని  పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతోపాటు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఇతర బలమైన కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.


గతంలోనే టీడీపీ తరఫున బలంగా వాయిస్ వినిపించిన సాధినేని యామిని.. పార్టీకి గుడ్ బై చెబుతారని  వార్తలొచ్చాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తరచుగా మీడియాలో ప్రతి ఒక ముఖ్యమైన డిబెట్లలో , చర్చల్లో కనిపించిన ఆమె.. వైఎస్ఆర్సీపీ గెలిచాక మూడు నెలలపాటు సైలెంట్ అయిపోయారు. దీంతో ఆమె పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది.


కానీ సెప్టెంబర్లో ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. అదంతా తప్పుడు ప్రచారమేనన్నారు. తాను మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్టు తెలిపారు. కానీ మనసు మళ్లీ  మార్చుకున్న యామిని పార్టీకి గుడ్ బై చెప్పారు.సాధినేని యామిని శర్మ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. నవంబర్ 10న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకుంటారని వార్తలొస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: