తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 35వ రోజుకు చేరుకుంది. అయితే ఇప్పుడు వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం విషయంలో ఎక్కడ సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు. అంతేకాకుండా ఇప్పుడు వరకు మూడు సార్లు ఆర్టీసీ సమ్మె  చేస్తున్న కార్మికులకు డెడ్ లైన్  విధించారు కేసీఆర్ . ఇచ్చిన గడువు లోపు సమ్మె చేస్తున్న కార్మికులందరూ విధుల్లో చేరాలని... లేనిపక్షంలో  ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులందరికీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక తాజాగా కెసిఆర్ విధించిన డెడ్ లైన్ ను  కూడా ఆర్టీసీ కార్మికులు అందరూ బేఖాతరు చేస్తూ యథావిధిగా సమ్మె  కొనసాగుతుందని స్పష్టం చేయడంతో... కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొదటి నుంచి ఆర్టీసీ సమ్మె విషయంలో మొండి వైఖరితో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... తాజాగా ఆర్టీసీ కార్మికులకు డెడ్ లైన్ విధించిన   ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గకపోవడంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది  తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 



 ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆర్టీసీలోని సగం రూట్లను  ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ లో  స్నేహపూర్వక పోటీ ఉండడం వల్ల ఆర్టీసీకి లాభాల వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం  భావిస్తుందని  కేసీఆర్ అన్నారు . అయితే తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. టి ఎస్ ఆర్టిసి లో 5, 100 రూట్లలో  ప్రైవేటు బస్సులు  ప్రవేశపెట్టాలన్న తెలంగాణ కేబినెట్ నిర్ణయం పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తెలంగాణలో 5,100 రూట్లలో ప్రవేట్ బస్సులు  ప్రవేశపెట్టాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకోగా. .. ఈ నిర్ణయాన్ని సవాల్  చేస్తూ టీజేఎస్ ఉపాధ్యక్షుడు పీఎల్  విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు స్టే విధించింది. 



 సోమవారం లోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా అదనపు ఆడిటర్ జనరల్ ఆదేశించింది హైకోర్టు. ఈ సందర్భంగా టీజేఎస్ ఉపాధ్యక్షుడు పి యల్ విశ్వేశ్వరావు  దాఖలు చేసిన పిటిషన్ పై  విచారణ సోమవారానికి వాయిదా వేసింది  హైకోర్టు. అయితే ఆర్టీసీలోని 5, 100 రూట్లను  ప్రైవేటీకరిస్తాం  అని కేసీఆర్ క్యాబినెట్  తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించడంతో హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మిక సంఘాల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. హైకోర్టు తీర్పును ఆర్టీసీ కార్మికుల తొలి విజయంగా పేర్కొన్న ఆర్టీసీ జేఏసీ నేతలు ... ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం తమ తీరు మార్చుకొని  ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం పై  దృష్టిసారిస్తే బాగుంటుంది అంటూ డిమాండ్ చేస్తున్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: