వారు డబ్బులున్న వారు కాదు. అవీనీతి చేస్తూ సంపాదించే వారు కాదు. తమ అవసరాలకోసం ఒళ్లును అమ్ముకొని బ్రతుకుతున్న వేశ్యలు. వీరి దగ్గరికి ఎవరైన సుఖం కోసం వెళ్ళితే చచ్చిన శవంలా శరీరాన్ని అప్పగించి వారు పెట్టే బాధలు భరిస్తూ తమ బ్రతుకులు వెళ్లతీస్తుంటారు. అన్ని బాధలు భరించేది వారిచ్చే డబ్బుల కోసమే. ఒళ్లమ్ముకుని బ్రతికే ఇలాంటి వారిని మోసం చేస్తూ బ్రతికే వారు కూడా సమాజంలో ఉన్నారంటే ఎంత సిగ్గుచేటు.


ఇలాంటి వారు చేస్తున్న పని నీతిమాలిన పని అందులో వారికి దిక్కుమాలిన వాడు తగిలాడు. ఇంతలా జాలిపడేలా జీవించే సెక్స్ వర్కర్ల దగ్గర జాలి లేకుండా దోచుకుంటున్న ఇతగాడి వివరాల గురించి తెలుసుకుంటే, గుజరాత్‌లోని రాజ్‌కోట్ పట్టణంలో ఖరీదైన ప్రాంతంలో గల ఓ మల్టీప్లెక్స్ ఎదురుగా ఉన్న ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు తమకు సంబంధించిన ఓ వ్యక్తిని విటుడిగా అక్కడికి పంపారు.


అతను అమ్మాయిల కోసమని సెక్స్‌ రాకెట్ నిర్వాహకుడిని సంప్రదించగా ఇతన్ని విటుడు గానే భావించిన సదరు వ్యక్తి అతన్ని అమ్మాయిలు ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు. లోనికి వెళ్లిన అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వగా పోలీసులు ఆ ఇంటిపై  రైడ్ చేసి ఇద్దరు సెక్స్ వర్కర్లకు విముక్తి కల్పించారు. వారితో వ్యభిచారం చేయిస్తున్న షాపరా అనే వ్యక్తిని అరెస్ట్ చేసి. సంఘటనా స్థలం నుంచి రూ.5వేల నగదుతో పాటుగా, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


ఇకపోతే సెక్స్ వర్కర్లు అహ్మదాబాద్‌కు చెందినవారుగా గుర్తించారు పోలీసులు.  ఇదివరకే ఒకసారి షాపరా వ్యభిచారం నిర్వహిస్తూ 2012లో పోలీసులకు చిక్కి బెయిల్‌పై తిరిగొచ్చి మళ్లీ అదే పని చేస్తున్నాడని తెలిపారు. ఈ కేసులో చిక్కిన సెక్స్ వర్కర్లు తమ దగ్గరకు వచ్చే విటుల నుంచి షాపర గంటకు రూ.2వేలు వసూలు చేసి, తమకు మాత్రం రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నాడని  పోలీసులకు చెప్పారు.


ఇక ఇతని గురించి విచారించిన పోలీసులకు ఆర్థిక అవసరాలు గల అమ్మాయిలను వెతికి పట్టుకుని వారిని వ్యభిచారంలోకి దించుతున్నాడని, వారి శరీరాలతో వ్యాపారం చేస్తూ డబ్బు విషయంలో వారిని మోసగిస్తున్నాడని తేలింది. దీంతో ఇప్పటివరకు నిందితుడి బారిన పడి వ్యభిచారంలో మగ్గుతున్న మహిళలను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు...


మరింత సమాచారం తెలుసుకోండి: