మొత్తానికి అయిదు నెలల సస్పెన్స్ వీడనుంది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. గంటా మొదట వైసీపీలో చేరాలనుకున్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న కండిషన్ తో వెనక్కి తగ్గారని అంటున్నారు. అదే సమయంలో మంత్రి పదవిపై హామీ దొరకకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. మొత్తానికి గంటా చూపు కేంద్రలోని బీజేపీపైన పడిందని అంటున్నారు.


గంటా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగువారైన రామ్ మాధవ్ తో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఆయనకు బీజేపీలో సముచిత స్థానం లభిస్తుందన్న హామీతోనే కాషాయం కండువా కపుకుంటున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 10న ఏపీకి వస్తున్న బీజేపీకి చెందిన జేపీ నడ్డా సమక్షంలో గంటా బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని అంటున్నారు. అయితే గంటా ఒక్కరే బీజేపీలోకి వెళ్ళరని మరికొంతమందితోనే ఆయన జంప్ చేస్తారని అంటున్నారు.


అయితే ఎంతమంది పార్టీని వీడివెళ్తారన్నది కచ్చితంగా తేలనప్పటికీ కనీసంగా ఏడుగురు ఎమ్మెల్యేలు సైకిల్ దిగిపోవడానికి సిధ్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక వల్లభనేని వంశీ కూడా వైసీపీ వైపు వెళ్లారని అంటున్నారు. ఆయన సైతం బీజేపీ వైపుగా వస్తారన్న ప్రచారం మరోమారు వూపందుకుంది. అదే సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు కమలం కండువా కప్పుకుంటారని అంటున్నారు. గోదావరి జిల్లాలతో పాటు, కోస్తాలో కూడా టీడీపీ నుంచి సైకిల్ దిగిపోయేవారు ఉన్నారని అంటున్నారు.


వీరందరూ కనుక పార్టీని వీడితే టీడీపీలో శాసనసభాపక్షంలో చీలిక రావడం ఖాయమని అంటున్నారు. వీరు వేరుపడి ప్రత్యేక గ్రూప్ గా అసెంబ్లీలో ఉంటారని, రాజీనామాలు చేయకుండా కూడా కండువాలు కప్పుకునేలా ఈ మార్గం ఎన్నుకున్నట్లుగా చెబుతున్నారు.  మరి అదే జరిగితే ఏపీలో టీడీపీ పార్టీ మరింతగా ఇబ్బందులో పడుతుంది. అదే సమయంలో చంద్రబాబు సైతం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారని  అంటున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయం చాలా మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: