అసలు పాలనలో ఎలాంటి అనుభవం లేకపోయినా... తొలిసారి అధికారంలో వచ్చిన జగన్ కూడా ప్రజల నాడి బాగానే పట్టుకున్నట్లు కనబడుతోంది. అందుకే ప్రజలకు ఏం కావాలో అవి  చాలావరకు ఐదు నెలల పరిపాలనకాలంలోనే ఇచ్చేశారు. పింఛన్లు, ఉద్యోగాలు, రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు ఆర్ధిక సాయం, అగ్రిగోల్డ్ బాధితులకు సాయం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చేశారు. అయితే ఇక్కడ గమించాల్సిన విషయం ఏమిటంటే...ఈ ఐదు నెలల కాలంలో జగన్ అభివృద్ధి మీద పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పొచ్చు.


అభివృద్ధి విషయంలో అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, పలు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం ఇలా ఏ విషయంలోనూ జగన్ ముందడుగు వేయలేదు. కానీ సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఐదు సంవత్సరాల్లో చేయాల్సినవి...ఐదు నెలల్లోనే చేశారు. అందుకే అభివృద్ధి జరగకపోయినా...జనాల్లో మాత్రం జగన్ మీద క్రేజ్ తగ్గలేదు. ఎందుకంటే సంక్షేమ పథకం వల్ల ప్రతి సభ్యుడు లాభపడతాడు.


ఉదాహరణకు జగన్ లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు రావడం వల్ల యువత, ఆ యువత కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. గ‌త ప‌దేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో యువ‌త ఎలాంటి ఉద్యోగాలు రిక్రూట్ కాక తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. ఇప్పుడు జ‌గ‌న్ ఐదు నెల‌ల్లోనే భారీగా ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌డంతో వాళ్ల కుటుంబాల్లో ఎక్క‌డా లేని సంతోషం నెల‌కొంది.


ఇక యువ‌త సంగ‌తి ఇలా ఉంటే పింఛన్లు, రైతుభరోసా, అమ్మఒడి ఇలాంటి వాటి వల్ల ప్రతి ఒక్కరూ లబ్ది పొందుతూ...జగన్ పట్ల పాజిటివ్ గా ఉంటారు. అందుకే జగన్ ముందు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా అని అభివృద్ధి ఏమి గాలికొదిలేయారు. ఇంకా నాలుగున్నరేళ్లు పాలన సమయం ఉంది. ఈ లోపు మంచి అభివృద్ధి అందించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. మొత్తానికైతే జగన్ సంక్షేమ పథకాలతో ప్రజల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: