గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న టీడీపీ  ఏ రేంజ్ లో హడావిడి చేసిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. అధికారం ఉండేసరికి ప్రతి నాయకుడు తమకు తామే సూపర్ పవర్లు లాగా ఫీల్ అయిపోయారు. ఎక్కడిక్కడే ప్రతిపక్షాన్ని అణిచివేయడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యే సరికి అదే టీడీపీ నేతలకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. అధికారంలో ఉన్నపుడు జగన్ని, వైసీపీ నేతలని టీడీపీ వాళ్ళు ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో తెలుసు. ఇక ప్రస్తుతం అధికారం వైసీపీ చేతిల్లోకి వెళ్లింది. టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయి.


అందుకే ఓటమి తర్వాత టీడీపీ నేతలు ఎక్కడిక్కడే గప్ చుప్ అయిపోయారు. ఏదో కొంతమంది నేతలు తప్ప మిగతా వారు సడి చప్పుడు లేకుండా ఉన్నారు. కాకపోతే అధినేత చంద్రబాబు మాత్రం వైసీపీపై పోరాటం చేస్తూనే ఉన్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దానిపైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ ఐదు నెలల కాలంలో పలు నిరసన కార్యక్రమాలు చేశారు. అయితే బాబు ఎంత చేసిన నేతలు దగ్గర నుంచి స్పందన పెద్దగా రావడం లేదు. ఇటీవల ఇసుక కొరతపై బాబు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.


ఈ నిరసన కార్యక్రమం అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. నేతలు పెద్దగా పాల్గొనలేదు. ఎందుకంటే ఎక్కడ నిరసన చేస్తే వైసీపీ ప్రభుత్వం తమపై, తమ కార్యకర్తలపై కేసులు పెట్టేస్తారనే భయంతో బెంబేలెత్తుతున్నారు. తాము అధికారంలో ఉన్న ఐదేళ్ల‌లో చేసిన ఓవ‌ర్ యాక్ష‌న్‌కు ఇప్పుడు చాలా మంది నేత‌లు త‌గిన శిక్ష‌లు అనుభ‌విస్తున్నారు. మ‌రికొంద‌రు నాడు తాము చేసిన ఓవ‌ర్ యాక్ష‌న్ త‌ల‌చుకుని తమ‌కు ఎలాంటి ?  గ‌తి ప‌డుతుందో ? అన్న టెన్ష‌న్‌తో ఉన్నారు.


ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా, బహిరంగంగా జగన్  పైనా గానీ, మంత్రులపైనా గానీ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు జైలుకు వెళ్లొచ్చారు. దీంతో లేనిపోనీ తిప్పలు ఎందుకని సైలెంట్ గా ఉండిపోతున్నారు. అందుకే బాబు  పిలుపునిస్తే చాలు భయపడిపోతుండ‌డంతో పాటు లైట్ తీస్కొంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: