కృష్ణా జిల్లా" తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న జిల్లా... ఎన్టీఆర్ సొంత జిల్లా... చంద్రబాబుకి పిల్లను ఇచ్చిన జిల్లా. కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్న జిల్లా ఇది. అందుకే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలమైన క్యాడర్ ఉంటుంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు దేవినేని నెహ్రూ హవాతో జిల్లాలో  కాంగ్రెస్ ప్రభావం చూపించేది. కాని హవా మొత్తం తెలుగుదేశం పార్టీకే ఎక్కువగా ఉంటుంది. 2014 లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ మెజారిటి స్థానాలు గెలిచింది. ఎందరో రాజకీయ ఉద్దండులు ఈ జిల్లా నుంచి పార్టీకి దొరికారు. వైసీపీలో గెలిచిన వాళ్ళు కూడా తెలుగుదేశంలోకి వెళ్ళారు.


ఇంకా చెప్పాలంటే ప్ర‌జారాజ్యం ఎంట్రీతో జిల్లాలో జ‌రిగిన ట్ర‌యాంగిల్ ఫైట్లో సైతం 2009లో ఇక్క‌డ టీడీపీ తిరుగులేకుండా స‌త్తా చాటింది. ఇప్పుడు అదంతా గతం... 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలమైన క్యాడర్ ఉన్న జిల్లాలో కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఆ తర్వాత నాయకులు అందరూ కలిసి ఒక వ్యక్తిని టార్గెట్ చేశారు. ఆయనే దేవినేని ఉమా... ఒకప్పుడు కంచుకోట గా ఉన్న జిల్లాను నాశనం చేసింది ఆయనే అభిప్రాయం కార్యకర్తల్లో ఎక్కువగా వినపడుతుంది.


పార్టీ అధినేత చంద్రబాబుకి అత్యంత దగ్గరి వ్యక్తిగా ఉండే ఉమా జిల్లా నుంచి మరో నేతను పైకి రానీయకుండా చేసేందుకు ప్రయత్నాలు చేయడం అందరిని ఇబ్బంది పెట్టింది. కనీసం అన్న కొడుకు దేవినేని అవినాష్ రాజకీయ భవిష్యత్తుని కూడా ఉమా కాపాడలేకపోయారు. అవినాష్ గుడివాడ వెళ్తే ఎంత నష్టమో ఆయనకు తెలుసు. అయినా సరే గుడివాడ నుంచి బరిలోకి దించారు. ఇప్పుడు అవినాష్ కి ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు. ఇక పార్టీలో ఆయన దెబ్బకు బలమైన క్యాడర్ మొత్తం దూరం జరిగిపోయింది అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.


కొడాలి నాని టీడీపీలో ఉన్న‌ప్పుడు, వంశీ, కేశినేని, బొండా, దాస‌రి సోద‌రులు, మండ‌లి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉమా బాధితులే. సీనియ‌ర్ అయిన కాగిత‌కు ఏకంగా ఉమా దెబ్బ‌కు ఆరోగ్యం సైతం దెబ్బ‌తింది. కొడుకుని భవిష్యత్తునే కాపాడలేని వాడు ఇప్పుడు జిల్లాలో పార్టీ భవిష్యత్తుని ఏం కాపాడతాడనే వ్యాఖ్యలు కార్యకర్తల నుంచే ఎక్కువగా వినపడుతున్నాయి. ఇప్పుడు జిల్లాలో ఉమా నియంత ల‌క్ష‌ణాల‌ను వీడ‌క‌పోతే పార్టీకి భవిష్యత్తు కష్టమేనని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: