సుప్రీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నెల 17 న పదవీవిరమణ చేయనున్న చీఫ్  జస్టిస్ ఈ లోపు అయోధ్య తీర్పుతో పాటు మరో 5 కేసుల తుది తీర్పు వెలువడించేందుకు కసరత్తులు చేస్తున్నారు.


అయోధ్య తీర్పుకు కౌంట్‌డౌన్ మొదలయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో అయోధ్యపై తీర్పును నవంబర్‌ 15కు ముందే వెల్లడించేందుకు పక్కా ప్లాన్‌తో రంజన్ గొగోయ్ సిద్దమవుతున్నారు. అయోధ్య తీర్పు వెలువడిన రెండు రోజుల్లోనే చీప్ జస్టీస్ రంజన్ గొగోయ్ ఈ నెల 17 రిటైర్మెంట్ తీసుకోనున్నారు. అందుకే దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న అయోధ్య తీర్పుతో పాటు మరో 4 కేసులను పరిష్కరించాలనుకుంటున్నారు రంజన్ గొగోయ్.


అయోధ్య స్థల వివాదంపై మొదటి నుంచి ప్రత్యేక దృష్టితో కేసును విచారిస్తున్న రంజన్ గొగోయ్ ఉత్తరప్రదేశ్‌ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. యూపీలో ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతలపై ఆయన వారితో చర్చించారు. యూపీ సీఎస్‌ రాజేంద్ర కుమార్‌తివారీ, డీజీపీ ఓం ప్రకాశ్‌ సింగ్‌లను తన ఛాంబర్‌కు పిలిచారు సీజేఐ. దేశంపై దేశ రాజకీయాలపై ప్రభావం చూపించే ఈ చారిత్రక తీర్పుపై అధికారులు తీసుకుంటున్న ముందస్తు చర్యలను ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు.


తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న ఎస్‌ఏ బాబ్డే అయోధ్య కేసుపై స్పందించారు. ప్రపంచంలోనే అంత్యంత ప్రాధాన్యత కలిగిన కేసుల్లో ఇది ఒకటని తెలిపారు. అయోధ్య కేసుపై నియమితమైన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో బాబ్డే ఒకరు. ఇక చరిత్రాత్మక తీర్పు రానున్న నేపథ్యంలో యూపీలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 24 గంటలు పని చేసే మాస్టర్‌ కంట్రోల్‌ రూమ్‌ వ్యవస్థను నెలకొల్పారు. ఆయోధ్యకు అదనంగా 4 వేల మంది పారామిలటరీ సిబ్బందిని తరలించారు. తీర్పు వెలువడే వరకు144 సెక్షన్‌ అమలులో ఉండనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: