జబర్దస్త్ ఎమ్మెల్యే రోజా... ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అలనాటి అగ్రతారగా  ఎందరో  స్టార్ హీరోల సరసన మెరిసిన రోజా... ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంది. ఇక ఈ  టీవీలో ప్రసారమైన జబర్దస్త్ షోలో జడ్జిగా అవతారమెత్తింది. జబర్దస్త్ ప్రారంభమైనప్పటినుంచి జబర్దస్త్ షో కే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది రోజా. దీంతో రోజా  లేకుండా ఏదైనా ఎపిసోడ్ వచ్చిందంటే దాంట్లో రోజా లేని   లోటు కనిపిస్తుంది. జబర్దస్త్ షోలో తన నవ్వులతో పువ్వులు పూయిస్తుంది   రోజా. ఇక జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రజలందరికీ చాలా దగ్గర అయిపోయింది రోజా. ఈ నేపథ్యంలోనే రోజా ఎమ్మెల్యే రోజా గా మారింది అంటూ చాలా మంది భావిస్తుంటారు. 



 అయితే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా అటు ఏపీఐఐసీ చైర్మన్గా కూడా తాజాగా పదవి బాధ్యతలు చేపట్టింది. అయితే అటు రాజకీయాలను... ఇటు  జబర్దస్త్ షో ను బాలన్సింగ్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది రోజా.కాగా  గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రోజా మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ గత కొన్ని  రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా వైసిపి పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి జగన్ వెన్నంటే ఉంటూ పార్టీలో కీలక నేతగా ఎదిగారు రోజా. అయితే తాజాగా తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు ఎమ్మెల్యే,  ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా. చిత్తూరు జిల్లాలోని ఓ కాలేజీ ఫంక్షన్ కు  హాజరైన ఎమ్మెల్యే రోజా ప్రస్తుత కాలంలో చదువులపై కూడా తనదైన   శైలిలో సెటైర్లు వేశారు.



 ప్రస్తుతం చాలామంది పెద్దపెద్ద చదువులు చదువుతున్నారని కానీ సబ్జెక్టులో పట్టు ఉన్న వారు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారని తెలిపింది. అంతా మార్కుల మాయాజాలంలో కొట్టుకుపోతున్నారు అంటూ రోజా తెలిపింది.  నేను కూడా చిత్తూరు జిల్లాలోనే చదివానని బైపీసీ స్టూడెంట్ ని  అని రోజా  తెలిపింది. పద్మావతి ఉమెన్స్ కాలేజీ లో ఇంటర్ చదివాను అని తెలిపిన రోజా... ఇంటర్ తర్వాత సినిమాల్లో  అవకాశం రావడంతో ఎక్కువగా చదువుకునే అవకాశం రాలేదని తెలిపింది . కానీ ఎక్కడ బాధ పడలేదని. ఈ రోజుల్లో విద్యార్థులు చదివినట్టు 12 గంటల చదవడం తనవల్ల కాదు అని తెలిపింది. ఇప్పటికి కాలేజీ ఫంక్షన్లకు వెళ్ళాలి అంటే తనకు భయంగా ఉంటుందని.. అందుకే మోడ్రన్  చదువులు చదవలేక పోయా అని రోజా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రజలకు సేవ చేసే ఏ రంగమైనా మంచిదేనని రోజా విద్యార్థులకు సూచించారు. సినిమా రాజకీయాలు ఇలా ఏ రంగంలో అయినా ప్రవేశించవచ్చు అంటూ సూచించారు. ఇదిలా ఉంటే 1989లో చిత్తూరు జిల్లా పద్మావతి ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసినట్లు రోజా ఆమె  ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: