చంద్రబాబునాయుడుకి ఈ ఏడాది అసలు బాలేదు. ఏం చేసినా కూడా రివర్స్ లో కొడుతోంది. ఓ వైపు అధికారంలోకి వచ్చిన జగన్ సైతం రివర్స్ టెండర్లు అంటూ టీడీపీ కి రివర్స్ ఫోర్స్ ఏంటో
చూపించేస్తున్నారు. మరో వైపు బాబు బాధ ప్రపంచ బాధ కావాలని తెగ తాపత్రయపడుతున్నా అనుకున్న రిజల్ట్ రావడం లేదు, టార్గెట్ రీచ్ కావడం లేదు. దాంతో ఇపుడు మళ్ళీ బాబు  తన‌దైన మార్క్ పొలిటికల్ కలర్ కోసం రెడీ అయిపోతున్నారు.


ఏపీలో ఇసుక కొరత ఉందని సీఎం జగనే స్వయంగా అంగీకరిస్తున్నారు. అది ఈ నెలాఖరులో తీరుతుందని కూడా పరిష్కారం చెబుతున్నారు. అయినా సరే చంద్రబాబు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ అసలు ఆగడంలేదు. ఇసుక పేరిట పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలని చూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ అంటూ హల్ చల్ చేశారు. ఇక విజయవాడలో ఇసుక సత్యాగ్రహం పేరిట బీజేపీ కూడా చేయాల్సింది చేసింది. బాబు గారు పుత్రరత్నం లోకేష్ బాబు గుంటూర్లో ఒక రోజు ఇసుక దీక్ష పేరిట చేపట్టిన దీక్షకు కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దాంతో ఇపుడు ఏకంగా బాబు ఇసుక దీక్ష అంటూ ఈ నెల 14న ఒక రోజు అంతా ఉపవాసం  ఉండాలనుకుంటున్నారు.


ఓ వైపు కార్తీకమాసం, అందువల్ల పుణ్యం పురుషార్ధం రెండూ దక్కుతాయని టీడీపీ వేసిన ప్లాన్ కి వైసీపీ సర్కార్ ఆదిలోనే బ్రేకులేసింది. ఇసుక పేరిట డ్రామాలు ఇక ఆపండి అని వైసీపీ నేతలు అంటున్నారు. చేసింది చాలు. సీన్ అయిపోయింది. సినిమా అయిపోయింది అంటున్నారు. అయినా వినని బాబు ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్స్ అడిగారు. దానికి వైసీపీ సర్కార్ నో అనేసింది. ఇపుడు వేరే చోట అయినా ఇసుక దీక్ష చేసి తీరుతానని బాబుతో పాటు తమ్ముళ్ళు కూడా  అంటున్నారు. మరి వైసీపీ సర్కార్ దీక్ష చేయనిస్తుందా...బాబుకు మైలేజ్ వస్తుందా.. ఏమో. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: