టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశం లో దొంగలు పడ్డారు. దొంగలు తమ చేతివాటం ప్రదర్శించి ఏకంగా 20 మంది పర్స్ లను.. ఇంకొంత మంది  మొబైల్స్ ని ఎత్తుకెళ్లారు. గత మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో వైసీపీ బాధితులను పరామర్శించారు  టిడిపి అధినేత చంద్రబాబు. అంతేకాకుండా చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో  టిడిపి పార్టీ పరిస్థితి గురించి సమీక్షించి... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం టిడిపి క్యాడర్ ను సమాయత్తం  చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. అయితే ఈ సమావేశాలకు చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ముఖ్య నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. 



 ఇప్పుడు వరకు అంతా బాగానే ఉన్నా చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే చంద్రబాబు సమావేశంలో దొంగలు చేతివాటం చూపించారు.  సందట్లో సడేమియా అన్నట్లుగా సమావేశానికి వచ్చిన కొందరు దొంగలు రెచ్చిపోయారు. అందరూ సమావేశంలో మునిగిపోవడంతో  కొందరు నేతలు కార్యకర్తలను పర్స్ లను  దొంగలు మాయం చేసినట్లు  సమాచారం. సుమారు 20 మంది వరకు పర్స్ లను  కొట్టేసిన దొంగలు ఇంకొంతమంది మొబైల్ ఫోన్లను కూడా మాయం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్  నేత రవి నాయుడు కు చెందిన పర్స్  కూడా పోయింది. అయితే ఇంత మంది పర్స్ లు  మొబైల్ ఫోన్లు పోయినప్పటికీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఏ ఒక్క దృశ్యం కూడా కంట పడక పోవడం గమనార్హం. దీంతో సమావేశాల్లో పర్స్ లు  మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న నేతలు కార్యకర్తలు అందరు షాక్ కి గురయ్యారు. 



 కాగా  చంద్రబాబు సమీక్ష సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్ని  కమాండ్ కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. అయితే అందులో చెక్ చేసినప్పటికీ కూడా ఏ ఒక్క దొంగ చేతివాటం కూడా రికార్డు కాలేదు. ఇక చేసేదేమీ లేక పోలీసు అధికారులు కూడా మౌనంగా ఉండిపోవాల్సివచ్చింది. ఇక ఈ మేటర్ కాస్త ఆ నోటా ఈ నోటా పడి అందరికీ పాకిపోయింది. అయితే ఇప్పటివరకు దొంగలు ఎవరు లేని సమయంలో ఇంట్లో చొరబడి దొంగతనాలను చేయడం చూసాం. కానీ అందరూ ఉండగా అది సీసీ కెమెరాలు భద్రత లో జరుగుతున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమావేశంలో దొంగలు తమ  చేతి వాటం చూపించడం చూస్తుంటే... దొంగలు మరీ బరితెగించి నట్లు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: