ముఖ్యమంత్రి జగన్ అసలు వెనక్కు తగ్గడం లేదు. ఇచ్చిన ప్రతీ హామీ తీర్చాల్సిందేనని ఆయన పట్టుదలగా ఉన్నారు. జగన్ మాట ఇస్తే అది చట్టమైపోవాలి అంతే. ఈ వైఖరికి తోడు ఆయన దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఏపీలో కొత్త జిల్లాలు వూసు ఇంకా లేదేంటి అనుకున్న టైంలో జగన్ వాటి గురించి గత కొంతకాలంగా చేస్తున్న కసరత్తుని ఒక కొలిక్కి తెచ్చేశారు.


ప్రతీ పార్లమెంట్ ని ఒక జిల్లాను చేస్తానని చెప్పిన జగన్ దానికి అనుగుణంగా ఇపుడు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇపుడు పదమూడు జిల్లాలు ఉన్నాయి. అలాగే పాతిక పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగా 12 జిల్లాలు ఏర్పాటు చేయాలి. దాని మీద జగన్ ఒక నిర్ణయానికి వచ్చేశారు. అదెలా  అంటే విశాఖ జిల్లాలో కొత్తగా మూడు జిల్లాలు రాబోతున్నాయి.
అవి అరకు, అనకాపల్లి, ఇప్పటికే ఉన్న విశాఖపట్నం. ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఎలాగూ ఉంటాయి. ఇక  కాకినాడ. అమలాపురం. రాజమహేంద్రవరం. నరసాపురం. ఏలూరు. విజయవాడ. మచిలీపట్నం. గుంటూరు. నరసరావుపేట. బాపట్ల. ఒంగోలు. నంద్యాల,  కర్నూలు. అనంతపురం. హిందూపురం. కడప. నెల్లూరు. తిరుపతి. చిత్తూరు. రాజంపేట కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటు కానున్నాయట.


ఇక ఇందులో కొన్ని జిల్లాలకు స్థానికంగా  ఉన్న మహానుభావులు, ప్రముఖుల పేర్లు పెడతారని అంటున్నారు. ఉదాహరణకు అరకు, అనకాపల్లిలలో ఒకదానికి అల్లూరి జిల్లాగా పేరు మారుస్తారని అంటున్నారు. అలాగే విజయవాడ, మచిలీపట్నంలొలో ఒకదానికి ఎన్టీయార్ పేరు ఉంటుంది. అదే విధంగా మరికొందరి ప్రముఖుల పేర్లతో కూడా జిల్లాలు ఏర్పాటు కావచ్చునని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే  కొత్త జిల్లాల సరిహద్దులను కూడా నిర్ణయించి  కొత్త ఏడాదికి జగన్ ప్రకటిస్తారని అంటున్నారు.  కొత్త జిల్లాలు ప్రకటిస్తే కొత్త రాజకీయం కూడా దాంతోనే వస్తుంది. అది వైసీపీకే ప్లస్ అవుతుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: