ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు ముందు ఉన్నాయా.. అవునంటోంది కేంద్ర ప్రభుత్వం.. వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడు వస్తాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు.


తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్, వివిధ చమురు కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించి ఎన్‌ఎంటీసీ నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు అంగీకారం కుదిరింది. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ప్రాంత మత్స్యకారులకు రూ.81 కోట్లు చెల్లిస్తామని ఓఎన్జీసీ అధికారులు అంగీకరించారు.


కాకినాడ– రాజమండ్రి ప్రాంతాల్లో పెట్రోలియం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్‌ ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి, రాష్ట్రానికి చెందిన అధికారులతో అత్యున్నత స్థాయి కమిటీ చేయనున్నారు. వచ్చే ఐదేళ్లలో ఏపీలో పెట్రోలియం, సహజ వాయువు, ఉక్కురంగాల నుంచి రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు రానున్నాయి.


అప్పులతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రానికి నిజంగా రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయన్న వార్త ఆనందం కలిగించేదే. అయితే ఇక్కడ మరో విషయం గమనించాలి. ఇవన్నీ పెట్టుబడుల రూపంలో వస్తాయని కేంద్రం చెబుతోంది. కాబట్టి ఇలాంటి వచ్చే వరకూ నమ్మాల్సిన అవసరం లేదు.


ఎందుకంటే.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అనేక భాగస్వామ్య సదస్సులు నిర్వహించారు. వాటికి విపరీతమైన ప్రచారం కలిగించారు. ఏకంగా చంద్రబాబు స్వయంగా అనేక దేశాలు తిరిగారు. ఏపీలో పెట్టుబడులు పెట్టమని కోరారు. కానీ వాస్తవంగా జరిగిన పారిశ్రామికాభివృద్ధి ఏపీలో అంతంత మాత్రమే. కాబట్టి ఇలాంటి ప్రకటనలకు ఉబ్బి తబ్బిబ్బై ఆనందపడిపోవడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: