మనుషులు పెరుగుతున్నారు.. ఆలోచనలు కూడా మారుతున్నాయి.. సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం కూడా బాగా పెరుగుతుంది.. అలాంటి ఈ కాలంలో టెక్నాలజీ కూడా బాగా పెరగడంతో  సినిమాను మించేలా ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచం పూర్తిగా మారిపోయింది. అలాంటి ఈ జెనెరేషన్ లో చాలా రకాలా సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు.అలా చెప్పాలంటే సైన్స్ పెరిగింది దానితో పాటుగా బద్ధకం పూర్తిగా పెరిగింది. అందుకే ఎక్కడ పడితే అక్కడ చెత్త కూడా బాగా పెరుగుతుంది. 


మహానగరాల్లో అయితే మాత్రం ఇంకా చెప్పాలంటే చెత్త లో నగరం అన్నట్లు ప్రాంతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ విషయానికొస్తే..పెరుగుతున్న కాలుష్యాల వల్ల మనుషులకు అనేక రకాల జబ్బులు కూడా ప్రబలుతున్నాయి. దానికి తోడు అధునాతన పరికరాలతో హాస్పిటల్స్ కూడా వస్తున్నాయి. దానితో కొందరు మాస్కులు కూడా ధరిస్తున్నారు. ఇక్కడ ఓ ప్రాంతంలో దేవుడికి కూడా మాస్క్ కట్టారు. 


వివరాల్లోకి వెళితే..  కాలుష్యాన్ని ఎలా తట్టుకోవాలో చూస్తున్నారు తప్ప.. నివారణ మార్గాలు మాత్రం ఎక్కడ చేయడం లేదు. ఇకపోతే.. కాలుష్యం బాగా పెరిగిందని ముఖానికి మాస్కులు ధరిస్తున్నారు. అది మనుసులకైతే ఓకే గాని శివలింగానికి కూడా మాస్క్ పెట్టారట. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది. 


కాగా , ఉత్తరప్రదేశ్ వారణాసిలోని తారకేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని పూజారులు శివలింగానికి మాస్కు పెట్టి పూజలు నిర్వహించారు. కాలుష్యాన్ని తగ్గించమని ఇలా చేశామని వారు వెల్లడించారు.శివలింగానికి ఎందుకు మాస్క్ పెట్టారని కొందరు అడిగితే.. ఆలయ పూజారులు మాట్లాడుతూ.. మనకు ఎలా పొల్యూషన్ భాదపెడుతుందో దేవుడికి కూడా అలానే అందుకే మాస్కులు పెట్టామని అన్నారు. ప్రస్తుతం ఈ శివలింగం మాస్క్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు చుడండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: