నారా లోకేష్ తన మాట తీరుతో .. పని తీరుతో జనాల్లో పప్పు అనే ముద్ర వేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవటంలో చతికలు పడ్డారు. భవిష్యత్ లీడర్ గా లోకేష్ ఇప్పటికి ఎదగలేకపోయారు. అయితే ఈ మధ్య లోకేష్ స్పీడ్ పెంచినట్టు ఉన్నారు.  ప్రతిపక్షంలోకి వచ్చాక దూకుడు పెంచడం టీడీపీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోందట.. మొన్న గుంటూరులో ఇసుక కొరతపై దీక్ష.. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి పరామర్శ.. ఎక్కడ ఏదీ జరిగినా అక్కడ వాలిపోయి లోకేష్ జనంలో కలిసిపోవడం.. పార్టీకి పూర్వపు జవసత్వాలు నింపడం చూశాక.. ఇప్పుడు ఖచ్చితంగా చినబాబుకు ప్రమోషన్ ఇవ్వాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014లో ఏపీ లో సీఎంగా అధికారం చేపట్టిన చంద్రబాబు.. తన కుమారుడిని జాగ్రత్తగా పైకి లేపి అధికారంలోకి తీసుకొచ్చి మంత్రిని చేశారు.


అయితే లోకేష్ తన ప్రతిభ వల్ల జనాల్లో కామెడీ పీస్ గా మారిపోయారు.  లోకేష్ దాన్ని అందిపుచ్చు కోలేక చతికిలిపడ్డ వైనం మనం చూశాం. ఇప్పుడు టీఆర్ఎస్ లో కేటీఆర్ నంబర్ 2 పొజిషన్ లో స్ట్రాంగ్ గా ఉండగా.. లోకేష్ ఇప్పుడిప్పుడే తడబడి బుడిబుడి అడుగులు వేస్తున్నారు. అయితే ప్రతిపక్షం లోకి వచ్చాక లోకేష్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. పార్టీ వ్యవహారాలను లోకేష్ పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ప్రజల్లోకి వెళుతూ దూసుకుపోతున్నారు.


అధికార పార్టీ మీద ఘాటుగా స్పందిస్తున్నారు. ట్విట్టర్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఎన్నికల తర్వాత ఫుల్ టైమ్ పార్టీ కార్యక్రమాలకే తన సమయం అంకితం చేస్తున్నారు.లోకేష్ స్పీడ్ చూసి ఇప్పుడు టీడీపీ అధిష్టానం పెద్దలు చంద్రబాబు ఖచ్చితంగా చినబాబుకు ప్రమోషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారట. లోకేష్ ను త్వరలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి చినబాబుకు ప్రమోషన్ దక్కుతుందా లేదా అన్నది వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: