అమ్మాయిలలో కనిపించే అందం మగవాళ్లను ఎంతలా మోసం చేస్తుందో అందరికి తెలిసిందే. ఇక ఈ అందాన్ని అడ్డం పెట్టుకుని కొందరు కిలాడి లేడీలు తమ తీయని మాటలతో, తమకున్న ముఖ సౌందర్యంతో మగవాడి బలహీనత మీద దెబ్బకొట్టి అందినంతగా దోచుకుంటున్నారు. ఇదేలా ఉందంటే. కాంతివంతగా ప్రకాశిస్తున్న దీపం దగ్గరికి వచ్చిన లైటు పురుగు అది మెరుపనుకుని దాని దగ్గరికి వెళ్లి ఆ వేడిదాటికి చస్తుంది. ఇప్పుడు లోకంలో మగాడి పరిస్దితి ఇలాగే తయారైంది.


ఇలాంటి వారి కోసమే మాయ లేడీలు తయారై సమాజంలో తమకున్న అందంతో వల వేస్తున్నారు. ఇకపోతే పెళ్లికాని యువకులను టార్గెట్‌ చేసి. మాయమాటలతో బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్న మాయలేడిని శుక్రవారం అబిడ్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ రవికుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. షాదాన్‌ సుల్తానా మలక్‌పేట్‌ ప్రాంతానికి చెందిన ఈమె ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి న్యాయవాదిగా పని చేస్తోంది.


ఈమెకు 2015లో అబిడ్స్‌లోని మైనారిటీ సంక్షేమ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ రికార్డు అసిస్టెంట్‌ రహీంతో  పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం హద్దులు దాటింది. ఇద్దరూ రోజు ఫోన్లో మాట్లాకుంటూ, ఎన్నో సార్లు కలిసి తిరిగారు కూడా. చనువు పెరిగిందికదా ఇక అప్పుడప్పుడు  అతడి నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టింది.. రహీం పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చాక తమ మధ్య సన్నిహిత్యాన్ని అవకాశంగా చేసుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు చేస్తూ  బయటపెడతానని బెదిరిస్తూ అతడి నుంచి భారీగా డబ్బులు డిమాండ్‌ చేసేది.


అలా ఆరు నెలల కింద అతని నుంచి రూ.3 లక్షలు తన ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుంది. మరో రూ.5 లక్షలు ఇవ్వాలని లేని పక్షంలో తనను వేధిస్తున్నావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో మనస్తాపానికిలోనైన రహీం గత నెల 19న అబిడ్స్‌లోని తన కార్యాలయం సమీపంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితురాలు షాదాన్‌ సుల్తానాను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.


ఇకపోతే ఈ కిలాడి లేడీ 2014 నుంచే ప్రేమ నాటకాలు మొదలు పెట్టి అదే సంవత్పరం ప్రేమ పేరుతో ఇద్దరిని  మోసం చేసింది. 2018లో ఏకంగా 14 మందిని తన వలలో వేసుకుని వారిని కూడా మాయ చేసింది. అంతే కాకుండా 2019లో మరో ముగ్గురిని మోసం చేసింది. నిందితురాలిపై సైఫాబాద్‌ పీఎస్‌లో 3, చాదర్‌ఘాట్‌లో 5, ఎల్బీనగర్‌లో 3, అంబర్‌పేట్‌ 2, అబిడ్స్‌లో 2, మీర్‌ చౌక్‌లో 4, నారాయణగూడ, మలక్‌పేట్, నల్లకుంట, ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి.


కాగా ఈమె బాధితుల్లో ఓ యువ లాయర్‌ కూడా ఉండడం గమనార్హం. చూసారుగా క్షనికమైన సుఖం కోసం ఆరాటపడితే దాని ఫలితం ఎలా ఉంటుందో.. ఇలాంటి వారు ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలా మందే ముసుగేసుకుని ఉన్నారు వీరిపట్ల జాగ్రత్తగా ఉండకుంటే మాత్రం జీవితాలు సర్వ నాశనమే...

మరింత సమాచారం తెలుసుకోండి: