బాబ్రీ మజీద్ ఎప్పుడు నిర్మించారు అనే దానిపై చారిత్రాత్మకంగా స్పష్టమైన ఆధారాలు లేకున్నా.. ఈ మజీద్ నిర్మాణంలో పురాతనమైన హిందూ దేవాలయానికి సంబంధించిన శిధిలాలను వినియోగించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.  అంటే మజీద్ నిర్మాణం కంటే ముందు అక్కడ హిందూ దేవాలయం ఉన్నది.  ఆ ఆలయం శిధిలాలపైనే ఈ మజీద్ ను నిర్మించారు.  ఈ విషయాన్ని అలహాబాద్ హైకోర్ట్ 2010 తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నది.  


బాబ్రీ మజీద్ లోపల హిందువులు, ముస్లింలు తమ ప్రార్ధనల కోసం వినియోగించుకున్నట్టుగా కూడా చెప్తున్నారు.  ఇక మజీద్ బయట ఉన్న స్థలాన్ని అటు ముస్లింలు, ఇటు హిందువులు కూడా వినియోగించుకున్నారు.  అయితే, బాబ్రీ మజీద్ నిర్మాణాన్ని ఆలయం శిధిలాలపైనే నిర్మించారని ఆలయంలో వినియోగించిన ఆలయాల శిధిలాలను బట్టి చూస్తే అర్ధం అవుతుంది. 


ఇప్పుడు వివాదాస్పదంగా ఉన్న మజీద్ లోని ఓ చిన్న ఆవరణలో రాముడు జన్మించిన భూమి ఉందని హిందువులు నమ్ముతూ వస్తున్నారు.  దానిపైనే ఇప్పుడు వివాదం నడుస్తున్నది.  1885 కు పూర్వమే రామ్ లల్లా, సీతా రసోయి విగ్రహాలకు అక్కడ పూజలు జరిగినట్టు అలహాబాద్ హైకోర్టు అప్పట్లో పేర్కొన్నది.  ఇక దీనిపై భారత పురాతత్వ శాఖ పరిశోధనకు సంబంధించిన నివేదికను కూడా అప్పట్లో కోర్టు పరిగణలోకి తీసుకుంది.  


పురాతత్వ శాఖ తవ్వకాల్లో 265 అధరాలు కనిపించినట్టు అలహాబాద్ హైకోర్టు తన 8189 పేజీల తీర్పులో పేర్కొన్నది.  1528లో బాబ్రీ మజీద్ నిర్మించారని చెప్తూ వస్తున్నారు.  ఈ మజీద్ ను అప్పుడే నిర్మించాలని చెప్పడానికి చారిత్రాత్మక ఆధారం ఏమి లేదని, ఈ విషయంలో హిందూ, ముస్లిం వాదనల్లో నిర్ధారిత సాక్ష్యాలు ఏమి లేవని అలహాబాద్ హైకోర్టు అప్పట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.  ఈ వివాదంపై అప్పట్లో అలహాబాద్ హైకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.  కాగా, దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 14 పిటిషన్లు దాఖలు అయ్యాయి.  దీనిపై నేడు తీర్పు రాబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: