ముఖ్యమంత్రి జగన్ ఆరు నెలల పాలనకు చేరువలో ఉన్నారు. ఈ ఆరు నెలల వ్యవధిలో తాను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని జగన్ ప్రమాణం సందర్భంగా చెప్పారు. జగన్ పాలన విషయం తీసుకుంటే పాజిటివ్ గానే జనం రియాక్ట్ అవుతున్నారు. మరో వైపు విపక్షం సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా కనీస టైం ఇవ్వకుండా రెచ్చిపోతోంది. దీంతో ఏపీలో కొత్త రాజకీయం చోటుచేసుకుంటోంది.


ఏపీ విషయానికి వస్తే జగన్ బలవంతుడు  అని ప్రతిపక్షం చెప్పకనే చెబుతోంది. కేంద్రంలోని మోడీ సర్కార్ సైతం ఏపీని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలనుకుంటోంది. జగన్ కి జనం ఇచ్చిన బలమైన మ్యాండేట్ ఇందుకు కారణం. జగన్ వెంట జనం ఉన్నారన్న సత్యాన్ని  మొత్తానికి రాజకీయ పక్షాలు అన్నీ గుర్తించాయి. ఇదిలా ఉండగా ఏపీలో విపక్షం ఏదో విషయం పట్టుకుని హడావుడి చేయడం తప్ప జనంలోకి అది  పెద్దగా ఫోకస్ కావడంలేదు.


దానికి కారణం సార్వత్రిక  ఎన్నికలు అయిపోయాయి. కొత్త సర్కార్ వచ్చింది. దానికి కొంత టైం ఇద్దామన్న ఆలోచన ప్రజలలో ఉండడమే. అయితే ప్రతిపక్షాలు కానీ జగన్ కి ఎక్కువ సమయం ఇస్తే ఆయన మరింత బలవంతుడు అవుతాడని భయపడిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెల్లారిలేస్తే చంద్రబాబు నాయుడు జగన్నే టార్గెట్ చేస్తుకుంటున్నారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి దారుణమైన ముఖ్యమంత్రిని చూడలేదని వేరే భాష వాడేస్తున్నారు. ఏపీలో శాంతి భద్రతలు లేవని, జగన్ కి వాళ్ళ తాత పోలికలు వచ్చాయంటూ ఏవేవో  విమర్శలు చేస్తున్నారు. ఇక ఇసుక దుమారం రేపుదామని అనుకున్నా కూడా ఇపుడు ఆ సమస్య కూడా తీరిపోయేలా ఉంది.


గతంలో రోజులు యాభై వేల టన్నులు ఇసుక సరఫరా  చేస్తే ఇపుడు అది లక్ష్న టన్నులకు చేరింది. దాంతో తొందరలోనే ఇసుక సమస్య తీరే అవకాశమైతే కనిపిస్తోంది. మరో వైపు జగన్ సంక్షేమ పధకాల  జోరు పెంచారు. అభివ్రుధ్ధి విషయంలోనూ అడుగులు వేస్తున్నారు. కడపలో స్టీల్ ప్లాంట్, కాకినాడలో పెట్రోలియం కెమికల్ కాంప్లెక్స్ లకు కేంద్రం ఓకే చెప్పేసింది.  


 పోలవరం, అమరావతి విషయంలో కొత్త ఏడాది నుంచి పూర్తి ద్రుష్టి పెట్టాలని జగన్ కూడా డిసైడ్ అయ్యారని భోగట్టా.  ఇంకో వైపు ఆదాయం పెంచుకునే పనిలో కూడా జగన్ ఉన్నారు. ఇలా  జగన్ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతూంటే ఆయన్ని కంట్రోల్ చేయలేక విపక్షం వీగిపోతోంది. ఇపుడున్న పరిస్థితుల్లో జగన్ బలవంతుడు అని అంతా అంగీకరించేస్తున్నారు. జగన్ చేపడుతున్న కార్యక్రమాల ఫలితాలు కొత్త ఏడాది నుంచి వస్తాయి. అపుడు ఇక  జగన్ని పట్టడం కష్టమేనని కూడా విపక్షాలు అంచనా కడుతున్నాయి. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: