రామ్ మందిరం ఏర్పాటుకు సంబంధించిన కేసులు ఎన్నో కోర్టులో ఉన్నాయి.  అలహాబాద్ హైకోర్టులో వ్యాజ్యం తరువాత ఈ కేసుకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. అలహాబాద్ హై కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదనలు జరిగే సమయంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు ఈ కేసు విషయంపై అనేక పరిశోధనలు చేశారు.  దేశంలో అత్యంత సున్నితమైన విషయం రామ్ మందిరం, బాబ్రీ మజీద్ కేసు.  ఈ కేసులో ఏ చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం దేశప్రజలపై పడుతుంది.  


దేశంలో శాంతి నెలకొని ఉండాలంటే ఈ కేసు విషయంలో అన్ని అంశాలను పరిశీలించాలని అప్పటి హైకోర్టు అభిప్రాయ పడింది.  ఈ కేసుకు సంబంధించిన ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకుంది.  ముఖ్యంగా రామ్ జన్మభూమి విషయానికి సంబంధించి గతంలో ఏవైనా కేసులు ఉన్నాయా అని పరిశీలించిన కోర్టుకు ఓ విషయం తెలిసిందే.  1885లో రామ్ చబుత్ర ప్రాంతంలో రామ్ మందిరం ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ 1885లో మహంత్ రఘువర్ దాస్ అనే వ్యక్తి ఫైజాబాద్ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు.  


ఈ కేసును విచారించిన ఫైజాబాద్ జిల్లా కోర్ట్ రఘువర్ దాస్ కేసును విచారించింది.  రఘువర్ దాస్ వేసిన పిటిషన్ బాబ్రీ మజీద్ కు చెందిన ముతావలీ మహ్మద్ అస్గర్ వ్యతిరేకించారు.  సుదీర్ఘమైన విచారణ అనంతరం జిల్లా కోర్టు రామ్ చబుత్ర ప్రాంతంలో రామ్ మందిరం నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు.  నిర్మాణానికి అనుమతి ఇస్తే మత ఘర్షణలకు బీజం వేసినట్టు అవుతుందని అప్పటి ఫైజాబాద్ జిల్లా కోర్టు తీర్పులో పేర్కొన్నది.  


ఈ విషయాన్ని అలహాబాద్ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది.  ఇక వివాదాస్పద స్థలంపై 1885, 1950 సంవత్సరాలకు చెందిన చిత్రపటాలను ఆధారంగా చేసుకొని మూడు కట్టడాలు బాహ్య ఆవరణలోనే ఉన్నట్టుగా గుర్తించారు. అంతేకాదు, మజీద్ కు సంబంధించిన స్థలం బాబర్ కు సంబంధించినదిగా ముస్లింలు రుజువు చేసుకోలేకపోయినట్టుగా అలహాబాద్ హైకోర్టు తన తీర్పులో పేర్కొన్న సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: