అయోధ్య భూవివాదం కేసులో ఈరోజు తీర్పు చెప్పబోతున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనం కు పోలీసులు భద్రత పెంచారు. తీర్పు నేపథ్యంలో న్యాయమూర్తుల ఇళ్ల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనానికి సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యం వహించనుండగా జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే సభ్యులుగా ఉన్నారు. 
 
జెడ్ ప్లస్ కాటగిరీ భద్రత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కు ప్రభుత్వం కల్పించింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ రూమర్లను నమ్మొద్దని చెప్పారు. అయోధ్యలో ఈరోజు తీర్పు నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా 12 వేల మంది పోలీసు బలగాలతో పాటు వీరికి అదనంగా 16 వేల మంది వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. అక్టోబర్ నెలలో ఈ కేసుపై ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. 
 
సుప్రీం కోర్టు ఈ కేసు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. సీఎం యోగి అదిత్యనాథ్ శాంతి కోసం పాటుపడాలని కోరారు. 1528 సంవత్సరంలో బాబర్ సేనాని మీర్ బాఖీ బాబ్రీ మసీదును నిర్మించాడు. 1853 సంవత్సరంలో తొలిసారి గొడవలు, మత విద్వేషాలు అయోధ్యలో జరిగాయి. 1885లో మొదటిసారి ఈ వివాదం కోర్టు మెట్లెక్కింది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఈ వివాదంపై తీర్పు చెప్పింది. 
 
2011 సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రిజర్వ్ లో ఉంచిన తీర్పును ఈరోజు ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలువరించబోతుంది. ఈరోజు అయోధ్య తీర్పు నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదు. న్యాయమూర్తుల గురించి ఎవరూ ఎటువంటి వ్యాఖ్యానాలూ చేయకూడదు. ఈ నెల 17వ తేదీన రంజన్ గొగోయ్ పదవీ విరమణ నేపథ్యంలో అయోధ్య తీర్పు గురించి ముందుగానే సంకేతాలు వచ్చాయి. ఈరోజు 10.30 గంటలకు తీర్పు వెలువడనుంది. 



 



మరింత సమాచారం తెలుసుకోండి: