ఆర్కే! వైసీపీ ఎమ్మెల్యేల్లో కీల‌క‌మైన నాయ‌కుడిగా, ముఖ్యంగా పార్టీ త‌ర‌ఫున పోరాటం, ప్ర‌జ‌ల్లో ఉండ‌డం అనే రెండు కీల‌క అంశాల‌ను భుజాల‌పై మోసిన నాయ‌కుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు మంగ‌ళగిరి ఎమ్మ‌ల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఉర‌ఫ్ ఆర్కే. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండే త‌త్వంతో ఆయ‌న ముందుకు సాగారు. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోని త‌ప్పుల‌ను ఎత్తి చూపుతూ.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ.. అండ‌గా ఉంటూ.. ఆయ‌న స‌త్తా నిరూపించుకున్నారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆర్కేను ఓడించేందుకు టీడీపీ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిందో అంద‌రికీ తెలిసిందే.


సంబంధం లేక పోయినా.. చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌ను ఇక్క‌డ నుంచి పోటీ చేయించింది. అయితే, మంగ‌ళ‌గిరిపై ఆర్కే పెంచుకున్న ప‌ట్టు కార‌ణంగా ఐదేళ్ల‌లో ఆయ‌న చేసిన సేవ‌ల కార‌ణంగా ప్ర‌జ‌లు భారీ మెజారిటీతో తిరిగి రెండోసారి ఆయ‌న‌నే గెలిపించారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండ‌డం, వారికి సేవ చేయ‌డ‌మే ప‌ర‌మావ‌ధి ఉన్న ఆర్కే.. తాజాగా మ‌రో రికార్డు కూడా సృష్టించాడు. సీఎం జ‌గ‌న్ తాజాగా ప్రారంభించిన క‌నెక్ట్ టు ఆంధ్ర కార్య‌క్ర‌మంలో కీల‌క రోల్ పోషించాడు ఆర్కే. 'కనెక్ట్‌ టు ఆంధ్రా' కు తన ఐదేళ్ల ఎమ్మెల్యే జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.


ఇదే విషయమై ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణ చార్యులును కలిసి లేఖ అందజేశారు. సీఎం జగన్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న అమ్మ ఒడి, నాడు-నేడు, నవరత్నాల వంటి మేజ‌ర్ ప‌థ‌కాల అమ లుకు ' కనెక్ట్‌ టు ఆంధ్రా పేరుతో ప్రజా భాగస్వామ్యాన్ని కోరిన విష‌యం తెలిసిందే. ఎన్నారైలు స‌హా దేశంలోని తెలుగు వారు ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఇచ్చే విరాళాల‌ను ప్ర‌భుత్వ ప‌థ‌కాల రూపంలో ప్ర‌జ‌ల‌కు అందిస్తారు. అదేవిధంగా రాష్ట్ర అబివృద్ధికి కూడా వినియోగిస్తారు.


దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కోసం వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మొత్తానికి ఈ కార్య‌క్ర‌మానికి తొలి విరాళంగా ఆర్కే త‌న ఐదు సంవ‌త్స‌రాల వేత‌నాన్ని ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనిని గ‌మ‌నించిన ప‌రిశీల‌కులు ఆర్కే ప్ర‌జ‌ల‌కు బాగా క‌నెక్ట్ అవుతున్నారుగా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: