అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై హిందూ, ముస్లిం పక్షాల నడుమ దశాబ్దాలుగా వివాదం నెలకొంది. నేడు ఈ వివాదం పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉదయం 10.30కు ఈ తీర్పును వెలువరించనుంది. అసలు అయోధ్య వివాదం ఎలా మొదలైందో పూర్తి వివరాలు మీ కోసం.


అయోధ్య ప్రాంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో ఉంది. మొట్టమొదట ఈ వివాదం 1885 వ సంవత్సరంలో తెర పైకి వచ్చింది, రామ్‌ఛబుత్ర ప్రాంతంలో మందిర నిర్మాణానికి అనుమతివ్వాలని కోరుతూ 1885లో మహంత్‌ రఘువర్‌దాస్‌ ఫైజాబాద్‌ జిల్లా కోర్టులో పిటిషన్‌ వేశారు. దానిని బాబ్రీ మసీదు ముతావలీ మహ్మద్‌ అస్గర్‌ వ్యతిరేకించారు. విచారణ తర్వాత రఘువర్‌దాస్‌ వ్యాజ్యాన్ని జిల్లా కోర్టు కొట్టివేసింది. అప్పటికే ఈ ప్రాంతం లో మసీదు ఉంది. 1528 వ సంవత్సరంలోనే ఈ స్థలం లో రామాలయం నిర్మించినట్లు హిందువులు చెప్తూ కోర్టు కు వెళ్లారు. ఇక కోర్టు లో హిందూ, ముస్లింల ఇద్దరి వాదనల్లోనూ నిర్ధారిత సాక్ష్యాలు లేవంటూ జస్టిస్‌ యు.ఎస్‌.ఖాన్‌, జస్టిస్‌ అగర్వాల్‌లు అభిప్రాయపడ్డారు. 


ఇక 1949 వ సంవత్సరంలో మసీదు లోపల రాముడి విగ్రహాలు దొరికాయ్,  హిందువులు ఈ విషయాన్ని కోర్టు కు వివరిస్తూ ఈ అయోధ్య ప్రాంతం రామా జన్మభూమి అని ముస్లింలు రామాలయం కూల్చి దానిపై మసీదు నిర్మించారని కోర్టు కు తెలిపారు. ఇలా కోర్టు ల్లో పలు రకాల పిటిషన్లు ఈ వివాదాస్పద స్థలంపై నమోదు అయ్యాయి. తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో బాబ్రీ మసీదు నిర్మాణం 1992 డిసెంబర్‌ 6వ తేదీన కూల్చివేతకు గురైంది. దాంతో, దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో మతకలహాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన తరవాత దేశం లో జరిగిన మత అల్లర్ల కారణం గా కనీసం 2000 మంది ప్రజలు చనిపోయారు. 


ఈ పరిస్థితుల్లో పైన పేర్కొన్న వ్యాజ్యాలన్నీ అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. 18 సంవత్సరాల పాటు సాగిన వాదనల అనంతరం అలహాబాద్‌ హైకోర్టు వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామ్‌లల్లా, సున్నీ వక్ఫ్‌ బోర్డ్, నిర్మోహి అఖాడాలకు సమానంగా పంచుతూ 2010లో తీర్పును ప్రకటించింది. ఈ తీర్పు ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు కు వెళ్లారు కక్షిదారులు. 2011 సంవత్సరం నుంచి అయోధ్య వివాదం పై సుప్రీం కోర్టు లో విచారణ కొనసాగుతోంది. ఇక ఈ రోజు తుది తీర్పు ను సుప్రీం కోర్టు వెలువరించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: