పని మనుషులుగా పనిచేసే మహిళలు ఒకటే ఇంట్లో కాకుండా రెండు మూడు ఇళ్లలో పనిచేసి  ఎక్కువ ఆదాయం పొందాలని అనుకుంటారు. అలా చేయడం కాస్త కష్టమైనప్పటికీ ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశతో పనిచేస్తుంటారు. ఈ క్రమంలో ఎవరైనా యజమానులు  తమను పని  నుంచి తీసేసారు అనుకోండి ఇక తమ ఆదాయం తాగినట్లే  కదా... ఇక్కడ పని కోల్పోయిన ఓ మహిళ దిగాలుగా కూర్చున్నారు. ఇది చూసిన యజమాని ఓ వినూత్న  ఆలోచనతో ఔరా అనిపించింది. వీరిద్దరి సక్సెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఆ యజమానురాలు చేసిన ఆలోచనతో ఆ పని మనిషి జీవితమే మారిపోయింది.ఇంతకీ ఆ యజమానురాలు ఆ పని మనిషికి ఏం సహాయం చేసింది అనుకుంటున్నారా...అది తెలియాలి  అంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే మరి. 



 పూణే కి చెందిన ధనశ్రీ షిండే  అనే మహిళా  బ్రాండింగ్, మార్కెటింగ్ రంగంలో  సీనియర్ మేనేజర్ గా పనిచేస్తోంది. అయితే ఆమె ఇంట్లో గీతా కాలే అనే మహిళ పని మనిషిగా  పని చేస్తోంది. కాగా  ఓరోజు ధనశ్రీ షిండే  ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత... తన ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న గీత కాలేను దిగాలుగా ఉండటం చూసి విషయం ఏంటో ఆరా తీసింది.కాగా తాను  రెండు మూడు ఇళ్లలో పనిచేస్తే ఆదాయం ఎక్కువగా వస్తుందని  కానీ ఓ యజమాని తనను  పని నుంచి తీసేశారని... దీంతో తనకు వచ్చే ఆదాయం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేసింది ఆ పనిమనిషి. అయితే ఆ పని మనిషి బాధను చూసిన తర్వాత యజమాని ఆమెకు ఏదైనా సహాయం చేయాలనుకుంది . ఈ క్రమంలోనే ఓ ఆలోచన చేసింది యజమాని ధనశ్రీ. వెంటనే పనిమనిషి గీతా కోసం ఓ బిజినెస్ కార్డు ని తయారుచేసింది. గీతా కాలే ఇంటిపని సహాయకురాలు బావ్దాన్  పేరుతో 100 కార్డులు ప్రింట్ చేయించింది ధనశ్రీ . 



 ఇక ఆ ముద్రుంచిన కార్డులన్నీటీలో   గీతా కాలే చేసే ఒక్కొక్క పనికి ఎంత మొత్తం తీసుకుంటుందన్న విషయాన్ని కూడా వివరించింది. ముద్రించిన ఆ కార్డులను వెంటనే తమ కాలనీలో ఓ వ్యక్తి సాయంతో పంపిణీ చేసింది. అయితే అదే కాలనీ లో ఉండే అస్విత  జవదేకర్ అనే మహిళ రికార్డులు చూసి ... ధనశ్రీ ఆలోచనకు ముచ్చటించి... ఈ కార్డు  మరింతమందికి చేరేలా చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో వెంటనే తన పేస్ బుక్ ఖాతాలో  పనిమనిషి గీత కాలే  కార్డును పోస్ట్ చేసింది. అంతే  సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోయింది ఈ కార్డు.మేము పని ఇస్తామంటే మేము  ఇస్తామంటూ వందలాది మంది గీతకు  ఫోన్ చేస్తున్నారు. పూణే నుండే  కాదండోయ్ దేశం నలుమూలల నుండి ఫోన్లు వస్తుండడం విశేషం. యజమాని చిన్న ఆలోచన ఆ పని మనిషి జీవితాన్నే మార్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: