ప్రపంచం రోజు రోజుకూ హింసాపూరితంగా తయారవుతున్నదనే విషయం మనం వొప్పుకొని తీరాలి. మొట్టమొదటగా, జీవితం అంటే ఏమిటి? అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ఇకపోతే ఎక్కడ చూసినా దుఃఖం, మితిమీరిన జనాభా, ఆప్రయోజకులైన రాజకీయవేత్తలు, రకరకాల మాయలూ, మోసాలూ, చిత్తశుద్దిలేక పోవడం, లంచగొండితనం వంటివి నిరాఘాటంగా సాగుతున్న ప్రపంచంలో మన అస్తిత్వం అన్నది ఏమిటి? అని ప్రశ్నించుకుంటే సమాధానం చెప్పలేని స్దితిలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం.


ఒకవైపు దోపిడీలు, రేపులు, హత్యలు. ఇదేనా మనం నేర్చుకునే సంస్కృతి. ఇందుకేనా పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నది అనిపిస్తుంది. ఒకప్పుడు ఉరిశిక్షపడ్డ మనిషి ప్రాణం తీయాలన్న ప్రభుత్వ అధికారులు ఆలోచించేవారు. ఒకవేళ తప్పని పరిస్దితుల్లో ఆ పని చేయవలసి వస్తే అపరాధంగా భావిస్తూ తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించే వారు. కాని ఇప్పుడు మనికున్న విలువ మనిషికి లేదు. నడి రోడ్లమీదే నరుక్కుంటున్నారు. ఇలాంటి సంఘటనే కర్ణాటకలో జరిగింది. 


ఓ వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడిన దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. తుమకూరుకు చెందిన సతీశ్ అనే యువకుడిని శుక్రవారం కొందరు దుండగులు నడిరోడ్డుపై కత్తులతో వెంబడిస్తూ సినీఫక్కీలో దారుణంగా  నరికారు. తీవ్ర రక్తస్రావంతో పడివున్న సతీశ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఇకపోతే సంఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తుపట్టే పనిలో పడ్డారు పోలీసులు. ఇక సతీశ్ అనే యువకుడిని ఇంత కౄరంగా ఎందుకు చంపారన్న దానిపై స్పష్టత లేదని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిగిన తర్వాతే అసలు నిజాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. ఇక నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన ఇప్పుడు తుమకూరు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: