ఎన్నో సంవత్సరాలనుండి హిందువులు కంటున్న కల అయోధ్యలో రామ మందిరం నిర్మిచాలని. ఆ కల ఎప్పటికప్పుడు వాయిదాపడుతూనే ఉంది. ఇకపోతే దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోయే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. అందువల్ల  దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీస్ అధికారులు..


ముఖ్యంగా కీలక ప్రాంతాలైనా అయోధ్య, యూపీలో భారీగా పారామిలటరీ దళాలను మోహరింప చేశారు. ఇందుకు గాను ఆయోధ్య పరిసర ప్రాంతాల్లో దాదాపు 20 వేల మందిని భద్రతకు నియమించారు ముందు జాగ్రత్త చర్యగా ఉత్తరప్రదేశ్ సహా ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సోమవారం వరకు సెలవులు కూడా ప్రకటించగా, రాజస్థాన్, కర్ణాటక, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాలు కూడా పాఠశాలలకు శనివారం సెలవులు ప్రకటించాయి.


అంతేకాకుండా భరత్‌పూర్‌ సహా మరికొన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు రాజస్థాన్‌ ప్రభుత్వం పేర్కొంది. అలాగే జైసల్మేర్‌లో నవంబరు 30 వరకు 144వ సెక్షన్‌ విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇకపోతే తీర్పును వెలువరిస్తున్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్.. అయోధ్య వివాదంలో ఉన్న వివాదాస్పద భూమి తమదేనంటూ షియా బోర్డు వేసిన పిటిషన్ అనర్హమైందంటూ కొట్టివేసారు.


అంతే కాకుండా తీర్పుపై ఐదుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం.. కాపీ చదివేందుకు అరగంట సమయం పడుతుందని. చరిత్ర, న్యాయ, మతపరమైన అంశాలకు లోబడే తీర్పు ఇస్తామని తెలిపారు. ఇదే కాకుండా మతపరమైన విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోదని, బాబ్రీ మసీదును ఎప్పుడు నిర్మించారో సరైన ప్రాతిపదిక లేదని, బాబరు కాలంలోనే మసీదు నిర్మించారని చెబుతున్నప్పటికి, మత గ్రంథాల ఆధారంగా తీర్పు ఇవ్వలేమని జస్టిస్ గొగొయ్ అన్నారు. ఇక అయోధ్య తీర్పు నేపధ్యంలో ప్రతి హిందువులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా మందిరాల్లో పూజలు, అర్చనలు కూడ చేస్తున్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి: