దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోయే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశం అంతటా ఈ తీర్పు కోసం ఉత్కంఠంగా ఎదురు చూడగా ఈ తీర్పు కారణంగా ఎక్కడ అల్లర్లు జరగకూడదని అన్ని చోట్ల భద్రత కట్టుదిట్టం చేశారు. 

                                           

అయితే ఈ నేపథ్యంలోనే సీజే పురావస్తు పరిశోధనలను చూస్తే 12వ శతాబ్దంలోనే ప్రార్ధన స్థలం ఉందని. అయితే అది దేవాలయం అని చెప్పడానికి అధరాలు లేవు దేవాలయాన్ని ద్వాంసం చేశారనడానికి పురావస్తు ఆధారాలు లేవని తెలిపారు. అయోధ్యను హిందూవులు రామజన్మ భూమిగా భావిస్తారు, ఈ భావనలో ఎలాంటి వివాదానికి తావు లేదు, ఈ నమ్మకానికి విలువ ఉందా లేదా అని తేల్చడం కోర్టు పరిధిలో లేదు అని తెలిపారు. 

                                   

బాబ్రీ మసీదుకు ముందు ఇస్లామిక్ నిర్మాణాలేవి లేవు అని తీర్పుపై ఐదుగురు జడ్జిజిలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. షియా బోర్డు భూమి తమదేనంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేసింది. చరిత్ర మతపరమైన న్యాయపరమైన అంశాలు పరిగణలోకి లోబడి తీర్పు ఉంటుందని, బాబ్రీ మసీదును ఖచ్చితంగా ఎప్పుడు నిర్మించారో ప్రతిపధిక లేదు అని బాబర్ కాలంలో బాబ్రీ మసీదు నిర్మాణం అని అన్నారు. మాత గ్రంధాలను బట్టి కోర్టు తీర్పు ఉండదు అని, నిర్మొషి పిటిషన్ ను కూడా కాలం చెల్లింది అంటూ సుప్రీం కోర్టు కొట్టేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: