దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న అయోద్య తీర్పు రానే వచ్చింది. అయోధ్యలోని రామ జన్మభూమి—బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది. అయితే సుప్రీంకోర్టు లో అయోధ్య వివాదం పై వాదనలు ముగిసిన దగ్గర నుంచీ దేశంలోని అన్ని ప్రధాన నగరాలలోనూ హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే అన్ని నగరాల్లోనూ శాంతి భద్రతల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. ఏకగ్రీవంగా తీర్పును వెల్లడించిన సర్వోన్నత న్యాయస్థానం. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి సుప్రీం కోర్టు అనుమతి. మసీదు నిర్మాణం కోసం వేరే స్థలాన్ని కేటాయించాలని తీర్పు. 


5 ఎకరాల స్థలాన్ని సున్ని వక్ఫ్ బోర్డుకు కేటాయించాలి. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదు. వివాదాస్పద స్థలం రాంలాలాకే చెందుతుంది. మూడు నెలల్లో అయోద్య ట్రస్ట్ ను కేంద్రం ఏర్పాటు చేయాలి. వివాదాస్పద స్థలాన్ని అయోద్య ట్రస్ట్ కు కేటాయించాలి. 2.77 ఎకరాల భూమిని అయోద్య ట్రస్ట్ కు వెంటనే అప్పజెప్పాలి. 


ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును చదివి వినిపించారు. మొత్తం తీర్పు చదివేందుకు అరగంట సమయం పడుతుందని సీజేఐ వెల్లడించారు. రాజకీయాలు, చరిత్రకు అతీతంగా ఈ తీర్పు ఉంటుందని అన్నారు. కాగా, అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం సుదీర్ఘంగా 40 రోజుల పాటు ఇరు పక్షాల వాదనలు వింది. అనంతరం అక్టోబర్ 16న తీర్పును రిజర్వులో పెడుతూ నిర్ణయం తీసుకుంది.  అనూహ్యంగా ఈరోజే కోర్టు తీర్పు ఇవ్వడం ఒక చరిత్రకు ముగింపు పలికేలా అనిపించింది. ఇదిలా ఉంటే..ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అప్రమత్తత ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: