అయోధ్యపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పు ప్రతిని చదివి వినిపిస్తున్నారు. ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవ తీర్పును ఇచ్చారు. రాజకీయాలకు చరిత్రకు అతీతంగా న్యాయం జరగాలని రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. షియా వక్ఫ్ బోర్డ్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు రంజన్ గొగోయ్ ప్రకటించారు. 
 
అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ముస్లింలకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సున్నీ బోర్డుకు ఐదు ఎకరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయోధ్య యాక్ట్ కింద 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయోధ్య కేసుకు ఆర్టికల్ 47 వర్తించదని సీజేఐ రంజన్ గొగోయ్ అన్నారు. 
 
ఐదుగురు జడ్జీలు ఏకగ్రీవంగా తమ తీర్పును వెలువరించారు. ఈ వివాదాస్పద భూమి హిందువులకు సంబంధించిందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. పురావస్తు శాస్త్రవేత్తల నివేదిక ఆధారంగా హిందువులకు సంబంధించిన స్థలం అని కోర్టు తేల్చింది. రామజన్మభూమి అయోధ్య అనడంలో ఎలాంటి సందేహం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
వివాదాస్పద భూమి రామజన్మభూమి అవునా...? కాదా..? అనే విషయం తాము చెప్పలేమని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉంది. వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, హిందూ నిర్మాణం ఉందని పురావస్తు విభాగం పేర్కొందని కోర్టు చెప్పింది. భూ యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయ సూత్రాల ప్రకారం నిర్ణయిస్తామని సీజేఐ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. 2.77 ఎకరాల స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. హిందూ మహాసభ లాయర్ వరుణ్ కుమార్ సిన్హా ఇది చారిత్రక తీర్పు అని భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని సుప్రీం కోర్టు ఇచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: