కొన్నేళ్ల నుండి భారతీయులందరూ ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు కాసేపటి క్రితం వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును చదివి వినిపించారు. రాజకీయాలు, చరిత్రకు అతీతంగా ఈ తీర్పు వెల్లడించడం జరిగిందని, వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేస్తున్నట్లు తెలిపారు. అలానే నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం తోసిపుచ్చింది. 


తీర్పుపై ఐదుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. చరిత్ర, మతపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించినట్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని, మసీదు కింద భారీ నిర్మాణం ఉందని అయితే దానిని ఖచ్చితంగా ఎప్పుడు నిర్మించారనే దానిపై ఆధారాలు లేవని అన్నారు. మసీదును ముస్లింలు ఎప్పుడు వదలివేయలేదని అన్నారు. అయోధ్యను హిందువులు రామజన్మభూమిగా భావిస్తారు. వారి విశ్వాసాలను తప్పుపట్టలేమని పేర్కొన్నారు. అయితే అక్కడ దేవాలయం ఉందనేందుకు ఆధారాలు లేవని తెలిపారు. నమ్మకం, విశ్వాసాల ఆధారంగా భూ యాజమాన్య హక్కులు నిర్ధారించలేమని తెలిపారు. 


ఈ వివాదాస్పద భూమి రికార్డుల ప్రకారం ప్రభుత్వానిదేని పేర్కొన్నారు. దీనితో దేశవ్యాప్తంగా బీజేపీ పై, అలానే ప్రధాని నరేంద్ర మోడీ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక గతంలో కశ్మీర్ అంశంలో కూడా మోడీ సర్కారు ఎంతో బాగా వ్యవహరించి దానికి ప్రత్యేక ప్రతిపత్తిని అందించి ప్రజాలందరితో అభినందనలు అందుకుందని, ప్రస్తుతం అయోధ్య రామ మందిరం  విషయమై హిందు, ముస్లిం ప్రజలిద్దరి పట్ల సానుకూలలత కలిగిన తీర్పు వెలువడడంలో కీలక పాత్ర వహించారని మోడీపై ప్రజలు పొగడ్తలు కురిపిస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: