ఎన్నాల్లో వేచిన ఉదయం..ఈనాడే నిజమవుతుంటే..అన్నట్లు గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న అయోద్య వివాదానికి ఈ రోజు తెరపడింది.  దేశంలోనే అత్యతంత సున్నితమైన కేసుగా పరిగణించబడిన అయోద్య కేసు నేడు తీర్పు వెలురించారు.  కాగా, ఈ తీర్పుపై విభిన్నమైన అభిప్రాయాలు వెలువరుతున్నా..ఇది సుప్రీమ్ తీర్పు కనుక అందరూ శిరసావహిస్తున్నారు.  తాజాగా అయోద్య తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు.  అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును తాము గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్‌ బోర్డు న్యాయవాది జఫర్‌యాబ్‌ జిలానీ అన్నారు. 

ఇది ఎవరి గెలుపు కాదు.. ఎవరి ఓటమి కాదని ముస్లిం పర్సనల్ లా బోర్డు చెప్పింది. కాకపోతే  సుప్రీంకోర్టు తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని.. ఈ తీర్పుపై చర్చించిన తర్వాతే తదుపరి కార్యాచరణకు సిద్ధవుతామని ఆయన పేర్కొన్నారు. సుప్రీం తీర్పు చారిత్రకమని స్పష్టం చేసింది ముస్లిం పర్సనల్ లా బోర్డు. చర్చల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. అప్పీల్‌కు వెళ్లాలా లేదా అన్నది తర్వాత నిర్ణయం తీసుకుంటామంది.  ఇక  దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన రామజన్మభూమి కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం కీలక తీర్పు వెల్లడించింది.

వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు... నిర్మోహి అఖాడా పిటిషన్‌ను సైతం తోసిపుచ్చింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు(సున్నీ వక్ఫ్‌ బోర్డుకు) ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయోధ్య చట్టం కింద మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. నేడు వెలువరించిన తీర్పుపై ప్రముఖలు సోషల్ మాద్యమాల ద్వారా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: