అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్ చేశారు. ఎన్నో శతాబ్దాల అయోధ్య కేసుకు నేడు తేరా పడింది. 2.27 ఎకరాల భూమి కోసం హిందు, ముస్లిం వర్గాలు 1853 నుండి భూమి నాది అంటే నాది అని వాదించుకున్న భూవివాదనికి నేటితో తేరా పడింది. 

                          

అయితే ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజలందరూ గౌరవిస్తున్నారు. ప్రముఖులంతా అయోధ్య తీర్పును గౌరవిస్తూ వారి అభిప్రాయాలను ట్విట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు రాజకీయనాయకులు తీర్పుపై స్పందించారు. ఈ తరహాలోనే సీఎం జగన్ కూడా ట్విట్టర్ వేదికగా అయోధ్య తీర్పు పై స్పందించారు. 

                  

సీఎం జగన్ ట్విట్ చేస్తూ ''అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది. ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను. ప్రజలందరు కూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాను.'' అంటూ ట్విట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: