దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య తీర్పు రానే వచ్చింది. భారతదేశ చరిత్రలోనే తీర్పు విడుదల అయ్యేందుకు అతి ఎక్కువ సమయం తీసుకున్న రెండవ కేసుగా రికార్డు నెలకొల్పిన ఈ అయోధ్య కేసు యొక్క తీర్పు కొద్ది గంటల ముందే వెలువడింది. చివరికి సుప్రీంకోర్టు గొడవ లో ఉన్న స్థలం లో గుడి కట్టుకునేందుకు అనుమతినిచ్చింది. అలాగే ముస్లిం లకు మసీదు కట్టుకునేందుకు వేరే స్థలాన్ని కేటాయించినట్లు వారు తెలిపారు. ఇందుకుగాను వారికి ఐదు ఎకరాల స్థలాన్ని కూడా ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది.

అయితే ఈ ఈ తీర్పు ఇంత ఆలస్యం అయ్యేందుకు గల కారణం 2019 లో నియమించిన మధ్యవర్తిత్వ కమిటీ ఘోరంగా విఫలం కావడమే. ఈ సంవత్సరం మే నెల 9వ తేదీన సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక సమర్పించిన త్రిసభ్య మధ్యవర్తుల కమిటీ అప్పుడు అనేకానేక పక్షపాత ఆరోపణలను ఎదుర్కొంది. త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీ తర్వాత మరో రెండు నెలలకు ఆగస్టు ఒకటో తేదీన సీల్డ్ కవర్ లో మరొక నివేదిక సమర్పించినా కూడా అది కూడా ఆశాజనకంగా లేదని రెండు వర్గాల లాయర్లు చెప్పడంతో పూర్తిగా ఆ కమిటీని నిర్వీర్యం చేయాల్సి వచ్చింది.

ఇలా 2019లో ఆగస్టు 2వ తేదీన మధ్యవర్తిత్వం విఫలమవడంతో గత సంవత్సరం ఆగస్టు 6 నుండి కేసు విచారణ రోజువారీ చేపడతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. అలా దాదాపు ఒక రెండు నెలలు నిర్విరామంగా వాదనలు విన్న తర్వాత నేడు సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సున్ని వక్ఫ్ బోర్డు తరపు లాయర్ మాత్రం తాము సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాము కానీ సంతృప్తి చెందలేదని అన్నారు. ఇక భవిష్యత్ కార్యాచరణపై తామింకా దృష్టి సారించాల్సి ఉందని ఆయన అన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: