ఈరోజు సుప్రీం కోర్టు అయోధ్య వివాదం కేసులో తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఒకే అభిప్రాయంతో కేసుపై తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు వివాదాస్పద స్థలాన్ని హిందువులకు ఇవ్వాలని, ప్రత్యామ్నాయ స్థలాన్ని ముస్లింలకు ఇవ్వాలని తీర్పు చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ప్రియాంక గాంధీ అయోధ్య కేసు వివాదం తీర్పు గురించి స్పందించారు. 
 
సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా మనం మాత్రం సంయమనం పాటించాలని ప్రియాంక అన్నారు. పరస్పర ప్రేమను, సామాజిక సామరస్యాన్ని పంచుకోవాలన్న విషయాన్ని మరిచిపోకూడని ప్రియాంక గాంధీ అన్నారు. వేల సంవత్సరాల నాటి భారత సాంప్రదాయమైన ఐకమత్యాన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత మనదే అని అన్నారు. హింసకు తావుండకూడదని మహాత్మగాంధీ పుట్టిన దేశంలో హింసకు చోటివ్వద్దని అన్నారు. మహాత్మగాంధీ కలలు కన్న దేశ శాంతిని కాపాడటం మన విధి అని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. 
 
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసింది. పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ మత సామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు. ప్రజలందరూ కూడా శాంత్రిభద్రతలకు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. సున్నీ వక్ఫ్ బోర్డ్ అయోధ్య కేసులో సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వక్ఫ్ బోర్డ్ తరపు న్యాయవాది తీర్పు సంతృప్తికరంగా లేదని అయినా గౌరవిస్తామని అన్నారు. 

ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా సుప్రీం కోర్టు తీర్పు గురించి స్పందించారు. కోర్టు తీర్పును గౌరవిస్తామని ముస్లింలంతా ముందునుంచే చెబుతున్నామని అన్నారు. అందరూ సంయమనం పాటించాలి. మనమంతా సోదరులం అని అంజాద్ భాషా వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అన్నారు. ప్రతి ఒక్కరు తీర్పును గౌరవించి అంగీకరించాలని అన్నారు. 






మరింత సమాచారం తెలుసుకోండి: