సాధారణంగా టాయిలెట్ కోసం ఎవరైనా వేలల్లో ఖర్చు పెడతారు. మరీ ధనవంతులైతే లక్షల్లో ఖర్చు పెడతారు. కానీ హాంగ్ కాంగ్ లోని ఒక వ్యక్తి మాత్రం టాయిలెట్ కొరకు ఏకంగా 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. వినడానికి వింతగా అనిపించినా హాంగ్ కాంగ్ లోని బంగారు దుకాణాల యజమాని ఏకంగా బంగారం వజ్రాలతో టాయిలెట్ ని తయారు చేయించాడు. హాంగ్ కాంగ్ లోని కోరోనెట్ అనే ప్రముఖ బంగారు దుకాణాల కంపెనీ యజమాని అరోన్ షప్ కి బంగారం, వజ్రాలతో ఆకర్షణీయమైన టాయిలెట్ తయారు చేయించాలన్న ఆలోచన వచ్చింది. 
 
బంగారంతో ఇప్పటికే కొన్ని చోట్ల టాయిలెట్లు ఉన్నాయని భావించిన అరోన్ షప్ వజ్రాలను కూడా పొదిగించాడు. భారత కరెన్సీలో ఈ టాయిలెట్ విలువ 9 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. చైనాలోని షాంఘైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ టాయిలెట్ ను ప్రదర్శనకు ఉంచారు. ఈ టాయిలెట్ ను ప్రదర్శనకు ఉంచడానికి కారణం కేవలం ఆసక్తి మాత్రమే అని అరోన్ షప్ చెబుతున్నాడు. 
 
ఈ టాయిలెట్ కోసం ఏకంగా 334.68 క్యారెట్ల బరువు ఉన్న 40,815 వజ్రాలను ఉపయోగించారు. అరోన్ షప్ ఈ టాయిలెట్ ద్వారా గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించాలని అనుకుంటున్నాడని సమాచారం. ఈ టాయిలెట్ ను అమ్మే ఉద్దేశం మాత్రం లేదని అరోన్ షఫ్ చెబుతున్నాడు. తనకు బంగారం, వజ్రాలతో టాయిలెట్ తయారు చేయించుకోవాలనే ఆలోచన వచ్చిందని అందువలనే బంగారం, వజ్రాలతో టాయిలెట్ చేయించుకున్నానని అరోన్ షప్ చెప్పాడు. 
 
సోషల్ మీడియాలో బంగారు, వజ్రాలతో పొదిగిన టాయిలెట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు డబ్బులు ఉంటే ఎన్ని వేషాలైనా వేస్తారు అని కామెంట్లు చేస్తున్నారు. బంగారం, వజ్రాలతో టాయిలెట్ చేయించుకోవటంతో అరోన్ షప్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: