కొన్ని వందల సంవత్సరాల నుండి కొనసాగుతున్న అయోధ్య భూమి హక్కుల వివాదం గురించి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో ఆలయ నిర్మాణం కోసం అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అయోధ్యలోనే సున్నీ వక్ఫ్ బోర్డుకు మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తుదితీర్పులో భాగమైన  ఐదుగురు న్యాయమూర్తుల వివరాలు ఫోటోల వరుస క్రమంలో ....
 
జస్టిస్ అశోక్ భూషణ్ : అలహాబాద్ హైకోర్టులో అడ్వకేట్ గా పని చేసిన అశోక్ భూషణ్ అదే కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1970 నుండి న్యాయవాద వృత్తిలో ఉన్న అశోక్ భూషణ్ 2014లో కేరళ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా కొన్ని నెలలు పని చేశారు. 2016లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 
 
జస్టిస్ డీవై చంద్రచూడ్ : 2016లో సుప్రీం న్యాయమూర్తిగా నియమితులైన డీవై చంద్రచూడ్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పని చేసిన వైవీ చంద్రచూడ్ తనయుడు కావడం గమనార్హం. అలహాబాద్ హైకోర్టు, బాంబే హైకోర్టు సీజేగా డీవై చంద్రచూడ్ గతంలో పని చేశారు. 
 
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ : 2018 అక్టోబర్ నెలలో రంజన్ గొగోయ్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012లో గొగోయ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈశాన్య రాష్ట్రాల నుండి బాధ్యతలు చేపట్టిన తొలి సీజేఐగా రంజన్ గొగోయ్ రికార్డు సృష్టించారు. గొగోయ్ అస్సాం రాష్ట్రానికి చెందినవారు. 
 
జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే : ఎస్.ఎ. బోబ్డే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయి పదవీ విరమణ తరువాత బాధ్యతలు చేపట్టబోతున్నారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జన్మించిన బోబ్డే 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టు అడిషనల్ జడ్జిగా పని చేశారు. 2002లో మధ్యప్రదేశ్ సీజేగా నియమితులైన బోబ్డే 2013 లో సుప్రీం న్యాయవాదిగా నియమితులయ్యారు
 
జస్టిస్ అబ్దుల్ నజీర్ : కేరళ హైకోర్టులో 20 సంవత్సరాల పాటు సేవలందించిన అబ్ధుల్ నజీర్ 1983లో అడ్వకేట్ గా కెరీర్ మొదలుపెట్టారు. ట్రిపుల్ తలాఖ్ వాదనలు విన్న బెంచ్ లో అబ్దుల్ నజీర్ సభ్యుడు. 2004 లో కేరళ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ నజీర్ 2017లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: