భారతీయ జనతా పార్టీ పూర్వ రూపం జనసంఘ్. 1950లలో జనసంఘ్ ఏర్పాటైంది. దానికి పాతికేళ్ళు ముందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడింది. ఆరెసెస్ రాజకీయ విభాగమే జనసంఘ్. మరో పాతికేళ్ళ తరువాత జనసంఘ్ జనతా పార్టీలో  లో విలీనం అయి తొలిసారి దేశ పాలనలో భాగ‌మైంది. ఇక 1980 నాటికి బీజేపీగా పేరు మార్చుకున్న తరువాత బీజేపీ రాజకీయ  దూకుడు మొదలైంది.


మరో దశాబ్ద కాలం అంటే 1990 నాటికి బీజేపీ దేశంలో పెద్ద పొలిటికల్ ఫోర్స్ గా ఆవిర్భవించింది. ఇవన్నీ ఇలా ఉంటే నాడు జనసంఘ్ కానీ తరువాత బీజేపీ కానీ రెండే రెండు సమస్యలను జనం ముందు పెడుతూ వచ్చాయి. అవే కాశ్మీర్, అయోధ్య. ఈ రెండూ కూడా తాము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని హమీలు ఇచ్చేది బీజేపీ. ప్రతీసారీ  ఎన్నికల ప్రణాళికలో తప్పనిసరిగా ఈ రెండూ ఉండేవి.


అయితే 2019 మాత్రం ఈ రెండింటినీ బీజేపీకి దూరం చేసింది. ప్రతీ ఎన్నికల ముందు అయోధ్యలో రామాలయం నిర్మిస్తామని బీజేపీ చెప్పుకొచ్చేది. అలాగే కాశ్మీర్ కు ఉన్న స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తామని 370 ఆర్టికల్ ని తొలగిస్తామని బీజేపీ హామీలు ఇచ్చేది. చిత్రంగా మోడీ రెండవమారు  గద్దెనెక్కిన ఆరు నెలల లోగానే ఈ రెండు సమస్యలు పరిష్కారం అయ్యాయి. వీటి వయసు డెబ్బయ్యేళ్ళు. కానీ వీటిని కేవలం మూడు నెలల వ్యవధిలో మోడీ పాలనలోనే  పరిష్కారానికి నోచుకున్నాయి.


కాశ్మీర్ సమస్యకు కఠిన పరిష్కారంగా 370 రద్దు చేసి రెండు ముక్కలు చేసిన మోడీ గ్రేట్ అనిపించుకున్నారు. ఆగస్ట్ 5, 6 తేదీల్లో ప్రత్యేక‌ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక అయోధ్య విషయంలో కూడా సుప్రీం కోర్టు రామాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ చేస్తూ తీర్పు వెలువరించడం మోడీ ప్రధానిగా ఉన్న కాలంలోనే జరగడంతో ఇక 2024 ఎన్నికలల్లో బీజేపీ మ్యానిఫేస్టోలో ఈ రెండు అంశాలు ఉండవని అంటున్నారు. మొత్తానికి ఎప్పటికీ తీరని, పరిష్కారం కాని అంశాల విషయంలో మోడీ ఏలుబడిలోనే  పరిష్కారం దొరకడంతో బీజేపీలో ఆనందం వెల్లివిరుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: