సమాజంలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసాలు రోజు రోజుకు  పెరిగిపోతున్నాయి. మంచి ఉద్యోగాలు పొందాలని నిరుద్యోగులనుకుంటున్న  ఆశలను ఆసరాగా చేసుకుని భారీగా డబ్బులు  దండుకుంటున్నారు కేటుగాళ్లు. గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామంటూ మల్టీనేషనల్ కంపెనీల్లో  ఉద్యోగాల్లో చేర్పిస్తామంటూ ఆశ చూపి  నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు  దండుకుంటున్నారు. ఈ రోజుల్లో ఇదో వృత్తి అయిపోయింది. నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశ చూపడం... దీనికోసం వారి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడం ఆ తర్వాత కనిపించకుండా మాయం అయిపోవడం... ఇలాంటి ఘటనలు రోజుకొకటి తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఘరానా మోసగాళ్లకు   డబ్బులు కట్టబెట్టిన నిరుద్యోగులు ఆ తర్వాత తాము మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. గత మూడు రోజుల క్రితమే ఏపీలో  ఇలాంటి మోసమే ఒకటి తెరమీదకి రాగా... తాజాగా   మరో కేటుగాడు యవ్వారం  బయటపడింది. 



 విజయవాడలో మరో ఘరానా మోసం బయటపడింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లోని సిఆర్డిఏ పేరుతో నకిలీ వెబ్ సైట్ ను ప్రారంభించాడు. సిఆర్డిఏ లో ఖాళీలు ఉన్నాయంటూ ఓ నకిలీ  అప్లికేషన్ కూడా క్రియేట్ చేశాడు. దీంతో నిరుద్యోగులు అందరూ ఆ అప్లికేషన్ లో లాగిన్  అయి  ఘరానా మోసగాన్ని సంప్రదించారు . అయితే దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఆంధ్ర ప్రదేశ్ సిఆర్డిఏ లో  భారీ ఖాళీలు ఉన్నాయని అందరికీ ఉద్యోగాలు లభిస్తాయని మాటలతో మాయ చేసాడు. కాగా  చివరికి సిఆర్డిఏ కార్యాలయం లో కాకుండా ఓ ప్రైవేటు కార్యాలయంలో నిరుద్యోగులు అందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించారు. 



 దీంతో అనుమానం వచ్చిన  నిరుద్యోగులు అందరూ ఈ విషయంపై సిఆర్టిఏ కార్యాలయం లో విచారించగా... సీఆర్డీఏ  కార్యాలయంలో అలాంటి ఖాళీలు  లేవని అది నకిలీ వెబ్ సైట్ అంటూ సీఆర్డీఏ  అధికారులు తెలిపారు. దీంతో  తాము  మోసపోయానని గుర్తించిన నిరుద్యోగుల పోలీసులకు   ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు  నకిలీ వెబ్ సైట్ నడుపుతున్న వ్యక్తి ప్రకాశం జిల్లాకు చెందిన వాడుగా గుర్తించి  అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా తమ నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేశారని నిరుద్యోగులు తెలపడంతో ఆ వ్యక్తిపై రెండు కేసులు నమోదు చేసి స్ట్రాంగ్  యాక్షన్ తీసుకోవడానికి  సిద్ధమయ్యారు  పోలీసులు. సిఆర్డిఏ పేరుతో నకిలీ వెబ్సైట్  లాంటివి ఎప్పుడు మళ్లీ పునరావృతం కాకుండా చూసేందుకు సీఆర్డీఏ  అధికారులు చర్యలు చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: