టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ... డబుల్ సెంచరీలు వీరుడు పరుగుల వరద పారించగల ధీరుడు . ఇలా చెప్పుకుంటూ పోతే రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. బౌలర్ల  వెన్నులో వణుకు పుట్టించ గల బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. డబుల్ సెంచరీలు చేయడంతో రోహిత్ శర్మ దిట్ట . ఇక సొగసైన షాట్లతో  బాల్ ని బౌండరీలు దాటించడం లో రోహిత్  శర్మ  స్టైలే వేరు. తన బ్యాట్ జుళిపించి   ఎన్నో విజయాలను టీ మీడియాకు అందించిన గొప్ప బ్యాట్స్మన్ రోహిత్ శర్మ. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్ గా  కొనసాగుతున్నారు. కాగా  బంగ్లాదేశ్ తో  రాజ్ కోట్ లో  జరిగిన రెండో టి20 మ్యాచ్ లో ఓ సందర్భంలో విపరీతమైన ఆగ్రహానికి లోనయ్యారు రోహిత్ శర్మ. టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్  బౌలింగ్ లో  బంగ్లా బ్యాట్స్ మెన్  సౌమ్య సర్కార్ ను వికెట్ కీపర్ గా ఉన్న రిషబ్ పంత్ స్టంప్ అవుట్ చేసాడు. అయితే దీని థర్డ్ ఎంపైర్ అనిల్ చౌదరి పరిశీలించి మొదట నాటౌట్ అని తేల్చేశాడు. దీంతో స్టేడియం లో ఉన్న భారీ తెరపై   నాటౌట్గా చూపడంతో  అది చూసిన రోహిత్ శర్మ అగ్గిమీదగుగ్గిలం అయిపోయాడు. 



 ఇంకేముంది తిట్ల పురాణం మొదలు పెట్టాడు. పరుషపదజాలంతో థర్డ్ ఎంపైర్  అనిల్ చౌదరి తిట్టాడు . ఆ నెక్స్ట్ సెకండ్ స్క్రీన్ పై అవుట్ అని రావడంతో క్యాప్టెన్  రోహిత్ శర్మ ఆగ్రహం కాస్త చల్లారింది . అయితే రోహిత్ శర్మ కోపమంత భారీ తెరలపై  స్పష్టంగా కనిపించడమే కాదు రోహిత్ తిట్లపురాణం మొత్తం స్టంప్  మైక్ ద్వారా వినిపించింది కూడా. అయితే మ్యాచ్ అనంతరం దీనిపై మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ... తానెప్పుడూ మైదానంలో భావోద్వేగాలతో నే ఉంటానని తెలిపాడు. ఎలాగైనా మ్యాచ్ గెలవాలని అనుకున్న సమయంలో భావోద్వేగాలకు లోను  కావడం సహజమేనని రోహిత్ శర్మ వెల్లడించారు. 



 అయితే ఈసారి మాత్రం కోపం వచ్చినప్పుడు కెమెరా ఎక్కడ ఉందో చూసుకొని జాగ్రత్తపడతాను  అంటూ చమత్కరించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. కాగా  తొలి మ్యాచ్ లో  ఓడిపోవడంతో రెండో మ్యాచ్ లైట్  తీసుకోలేక పోయానని... అందుకే కొంత తీవ్రత తనలో కనిపించిందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా  మూడు మ్యాచ్ ల  సిరీస్ లో  బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ గెలవగా... ఇండియా ఒక మ్యాచ్ గెలిచింది. దీంతో  చెరో మ్యాచ్ గెలిచి 1-1 తో సమానంగా ఉంది. కాగా  రేపు నాగపూర్ వేదికగా మూడో టి20 మ్యాచ్ జరగబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: