భారతీయులకు శ్రీరాముడు ఒక ఆదర్శం. అందరు శ్రీరాముడిలా ఉండాలని కోరుకుంటారు.  రాముడు చూపించిన మార్గంలో నడవాలని చెప్తారు.  రాముడిలా రాజ్యాన్ని పరిపాలించాలని అంటారు.  రాముడు ఒక మానవుడే కానీ, ఎన్నో గొప్ప పనులు చేశారు కాబట్టి మహనీయుడు అయ్యాడు.. దేవుడిగా కీర్తించబడ్డాడు.  శ్రీరాముడి జన్మస్థానం ఎక్కడ అంటే ప్రతి ఒక్కరు చెప్పే పేరు అయోధ్య.  


రాముడు అయోధ్యలోని పుట్టాడు.  అయోధ్యలో ఎక్కడ పుట్టాడు అనడానికి చారిత్రాత్మక ఆధారం ఉన్నదా అంటే.. దానికి ఎవరూ కూడా సమాధానం చెప్పలేదు.  రామజన్మభూమికి సంబంధించి ఎన్నో సంవత్సరాల తరబడి వివాదంలో ఉన్న భూమికి సంబంధించిన తుది తీర్పు ఈరోజు వెలువడింది.  వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని అయోధ్య ట్రస్ట్ కు ఇస్తున్నట్టు తీర్పు చెప్పింది.  ఈ తీర్పును అందరు ప్రతి ఒకరు గౌరవిస్తున్నారు.  ఆహ్వానిస్తున్నారు.  


ఈ తీర్పు వెలువడిన తరువాత ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు.  ఇది 130 కోట్ల మంది భారతీయుల విజయం అని, సుప్రీం కోర్టు చరిత్రలో నిలిచిపోయే తీర్పును ఇచ్చిందని మోడీ పేర్కొన్నారు.  భిన్నత్వంలో ఏకత్వమే మన విశిష్టత అని.. భిన్నత్వంలో ఏకత్వం ఎంత అపురూపమైన సుగుణమో సుప్రీం తీర్పు సందర్భంగా భారతదేశం ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిందని హర్షం వ్యక్తం చేశారు.  


ఒక కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వచ్చినపుడు కోర్టు ఎలాగైతే తీర్పును ఇస్తుందో.. అత్యున్నత న్యాయస్థానం కూడా అటువంటి తీర్పును ఇచ్చిందని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పును పరిశీలిస్తే..   కలిసి నడవడం, కలిసి ఉండటం, కలిసి పనిచేయడం అనే విషయాలు మనకు స్పష్టంగా అర్ధం అవుతుందని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయం అని చెప్పారు.  దేశంలో ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని, ఎవరు కూడా ఆవేశాలకు లోను కాకూడదని మోడీ చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: