ఒకే ఒక్క రాంగ్ స్టెప్ ఆ కుటుంబ రాజకీయ జీవితంపై పెద్ద దెబ్బపడింది. పంతానికి పోయి పరువు మొత్తం పోగొట్టుకున్నట్లైంది. ఇంతకీ అంతలా దెబ్బ తిన్న కుటుంబం ఏదో కాదు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కుటుంబం. రాజకీయాల్లో కోట్ల కుటుంబానికి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దివంగత కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ లో సీఎం కూడా అయ్యారు. ఇక తర్వాత ఆయన తనయుడు సూర్య ప్రకాశ్ కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగారు. మూడు సార్లు కర్నూలు ఎంపీగా గెలిచారు. 2009లో కేంద్రంలో మంత్రి పదవి కూడా చేపట్టారు.


అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ తుడుచుకుపెట్టుకుపోయింది. అయినా సరే 2014లో కోట్ల మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన లక్షపైనే ఓట్లు తెచ్చుకున్నారు కూడా. కానీ కాంగ్రెస్ లో ఉంటే రాజకీయ జీవితం కష్టమని భావించిన కోట్ల మొన్న ఎన్నికల ముందు టీడీపీ లేదా వైసీపీలోకి వెళ్లాలని చూశారు. జగన్ కూడా మంచి ఆఫర్లే ఇచ్చారు. కాకపోతే అంతకముందు కోట్ల ఫ్యామిలీకు వైఎస్ ఫ్యామిలీతో ఉన్న విభేదాలు కారణంగా సూర్య ప్రకాశ్ ఫ్యామిలీతో కలిపి టీడీపీలోకి వచ్చేశారు.


ఇక టీడీపీలోకి రావడమే వారికి నష్టం జరగడం మొదలైంది. సూర్య ప్రకాశ్ కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే... ఆయన భార్య సుజాతమ్మ ఆలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత వీరు టీడీపీలో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. టీడీపీ ఇప్పటిలో కోలుకునేలా కనిపించడం లేదు. అందులో కర్నూలులో టీడీపీ మరింత కష్టకాలంలో ఉంది.


ఇలాంటి పరిస్థితుల్లో తమతో పాటు కుమారుడు రాఘవేంద్రరెడ్డి భవిష్యత్ ఏంటనేది కోట్లకు అర్ధం కావడం లేదు. ఒకవేళ వైసీపీలోకి వెళ్ళి ఉంటే ఇద్దరు గెలిచేవారు. కుమారుడు భవిష్యత్ బాగుండేది. కానీ ఒకే ఒక్క రాంగ్ స్టెప్ వేయడం వల్ల కోట్ల ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్ శూన్యంగా మారిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: