ఈరోజు ఉదయం నుండి యావత్ భారతదేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య తీర్పు వెలువడింది. సుప్రీంకోర్టు 70 ఎకరాల వివాద భూమిని గుడి కట్టేందుకు కేటాయిస్తూ ఒక అయోధ్య ట్రస్టును త్వరగా అందుకు అణుగుణంగా ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ముస్లిం లకు మసీదు నిర్మాణానికి అయిదు ఎకరాల భూమిని విడిగా కేటాయించనున్నట్లు కూడా ప్రకటించింది. ఐదుగురు సభ్యుల జస్టిస్ కమిటీ అనేకానేక వాదనలు విన్న తర్వాత చాలా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తీసుకున్న నిర్ణయం ఇది.

అయితే మోడీ దేశాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాల క్రితమే తను చేసిన ప్రసంగంలో భారతదేశానికి ఈరోజు కొత్త అధ్యాయం మొదలైంది అని అన్నారు. వివాదాస్పద అయోధ్య అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పుని ఇచ్చిన నేపథ్యంలో జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని సుప్రీంకోర్టు తీర్పును దేశమంతా స్వాగతించింది అని చెప్పారు. మోడీ అన్న ఈ మాటలపై చాలామంది తీవ్ర వ్యతిరేకతను చూపుతున్నారు. మోడీ మొత్తం భారతదేశం ఈ తీర్పుని స్వాగతించింది అని ఎలా అనుకుంటున్నారని పలువురి ప్రశ్న.

ఉదయం నుండి మనం గమనించినట్లైతే కేవలం ఒక మతానికి చెందిన వారే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంబరాలు జరుపుకుంటుండగా మరొక మతం లో తీవ్ర వ్యతిరేకతను చూశాము. హైదరాబాదు ఎం.పీ అసదుద్దీన్ ఒవైసీ కూడా తాము సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని కానీ ఏ మాత్రం దీనిపట్ల సంతృప్తికరంగా లేమని వెల్లడించిన విషయం తెలిసిందే. వాట్సాప్ స్టేటస్ లలో మరియు ఫేస్ బుక్, ట్విట్టర్ లో పోస్టులు గనుక మనం గమనించినట్లయితే ఒక మతానికి చెందిన వారు ఈ నిర్ణయాన్ని ఒకటి వ్యతిరేకిస్తున్నారు లేదా నిర్ణయం ఏదైనా తమకు సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు కానీ స్వాగతిస్తున్నట్లు ఎక్కడా లేదు. ఉన్నా అది అతి కొద్ది శాతం కావడంతో మోదీ దేశం మొత్తాన్ని ఉద్దేశించి ఈ నిర్ణయం స్వాగతిస్తున్నట్లు ప్రకటించడం అనేది సబబుగా లేదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: