దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చరిత్రలో మిగిలిపోతుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు భిన్నత్వంలో ఏకత్వం ఈ తీర్పు అని ఆయన పేర్కొన్నారు. భారా జాతి ఒక్కటిగా ఎలా నడవాలన్న సందేశం ఈ తీర్పులో ఇమిడి ఉందని ఆయన పేర్కొన్నారు. మనమంతా కలసి మెలసి అభివ్రుధ్ధి కోసం ముందుకు సాగాలన్న అద్భుతమైన స్పూర్తిని ఈ తీర్పు ఇచ్చిందని చెప్పారు. జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ గొప్ప తీర్పు సుప్రీం కోర్టు ఇచ్చిందని ప్రశంసించారు.



ఈ తీర్పును వెలువరించిన న్యాయమూర్తులను కూడా ఆయన గొప్పవారుగా  అభివర్ణించారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు సమానమన్న సందేశం ఈ తీర్పులో ఉందని ఆయన చెప్పారు. ఈ తీర్పు నవ భారతానికి  సంకేతమని కూడా అన్నారు. అందరినీ మెప్పించే విధంగా తీర్పు రావడం అంత సులభం కాదని ఆయన అన్నారు. అయితే ఆ విధమైన తీర్పు చెప్పడం ద్వారా దేశ అత్యున్నత న్యాయ స్థానం మేలి మలుపునకు దేశాన్ని తిప్పిందని మోదీ చెప్పారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా, వ్యక్తులు అయినా వ్యవస్థ  అయినా కూడా ధైర్యంగా పరిష్కారం కోరుకోవడానికి కూడా ఈ తీర్పు ఒక ఆధారం, గట్టి  ఉదాహరణ అని ప్రధాని అన్నారు.


కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ న్యాయం తప్పకుండా జరుగుతుందన్న సందేశం కూడా ఈ తీర్పు ఇచ్చినదని మోడీ అన్నారు. ఈ తీర్పు స్పూర్తిగా తీసుకుని రేపటి భారతాన్ని అంతా కలసి నిర్మించుకుందామని ఆయన దేశ ప్రజలను పిలుపు ఇచ్చారు. అంతా ఒక్కటి అన్న సందేశాన్ని ప్రపంచానికి చాటామని కూడా ఆయన పేర్కొన్నారు. నవంబర్ 9 చరిత్రలో నిలిచే రోజు అని కూడా మోడీ అన్నారు. మొత్తానికి మోడీ భావోద్వేగ ప్రసంగం దేశవాసులకు ఆకట్టుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: