ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితం తర్వాత తెలుగుదేశం పార్టీ కి జరిగిన పరిణామాలు చాలా దారుణం అనే చెప్పాలి. అసెంబ్లీ లో వైఎస్ఆర్సీపీ నాయకులు దారుణంగా విరుచుకు పడిన సందర్భాలు దగ్గర నుండి తమ సొంత నేతలను కాపాడుకోలేని వైనం వరకు కు చాలా ఆటుపోట్లను ఎదుర్కొంది. త్వరగా ఇటువంటి గడ్డు పరిస్థితి నుండి బయటపడేందుకు వారి అధినేత చంద్రబాబు నాయుడు సరికొత్త స్త్రాటేజీ తో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీకి తన స్టేట్మెంట్స్ ద్వారా సరికొత్త సిగ్నల్స్ ఇస్తున్నారు. 

మొన్న ఈ మధ్యనే టిడిపి అధినేత బిజెపి పార్టీ తో తెగతెంపులు చేసుకోవడం తమ పార్టీకి చాలా నష్టం కలిగించిందని, ఎన్నికలకు ముందు తాము చేసిన అతి పెద్ద తప్పు అదే అని బహిరంగంగానే పశ్చాత్తాపపడ్డ విషయం తెలిసిందే. వారితో పోరు పెట్టుకోవటం వల్లనే తాము చివరికి 23 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అయితే ఇప్పటివరకు బిజెపి మరియు మోడీకి పెద్ద విరోధిగా తనను తాను చూపించిన చంద్రబాబు ఇప్పుడు ప్రధాని యొక్క భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలన్న ఆశయానికి తన పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. 

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఐదు ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడం భారతదేశానికి సాధ్యపడే విషయమే అని... మరియు ఇందుకు సంబంధించి ఒక డాక్యుమెంట్ ను తాము త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఆయన అన్నారు. అంటే మోడీ తో పాటు భారతదేశం ఈ ఘనత సాధించేందుకు తాము కూడా కలిసి ముందుకు నడుస్తామని... అందుకు ముందుసరిగా ఒక డాక్యుమెంట్ ను ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అలా చెప్పిన తర్వాత బాబు యధావిధిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జగన్ పాలనలో ఉన్న అవకతవకల గురించి మాట్లాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: