బంగారం ధర మళ్ళి భారీగా తగ్గింది. దీపావళి పండుగా పోయిన తర్వాత బంగారం వెలుగులు తారాస్థాయిలో వెలుగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గుదలతో రూ.39,650 రూపాయలకు చేరింది. అయితే అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా తగ్గటంతో  బంగారం ధరపై నేడు ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

           

కాగా నిన్న స్వల్పంగా కదిలిన బంగారం ధరలు నేడు ఒకేసారి 250 రూపాయిలు తగ్గటం చూసి పసిడి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 230 తగ్గుదలతో 36,350 రూపాయలకు దిగొచ్చింది. ఇక పోతే బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. దీంతో వెండి ధర కూడా 150 రూపాయిలు తగ్గుదలతో కేజీ వెండి ధర 48,600 రూపాయలకు చేరింది. 

                     

అయితే ఇదే ట్రెండ్ ఢిల్లీ మార్కెట్ లో కూడా కొనసాగింది. అక్కడ కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బానగరం ధర 180 రూపాయిలు తగ్గుదలతో 38,370 రూపాయలకు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల బంగారం కూడా 37,100 రూపాయలకు చేరింది. ఈ ధరలే విజయవాడ, విశాఖపట్నంలో కూడా కొనసాగుతున్నాయి. మరి ఈ ధరలు ఎన్ని రోజులు కొనసాగుతాయి అనేది చూడాలి. కాగా బంగారం తగ్గటానికి చాలా కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: