ఈ రోజు భారతదేశ చరిత్రలో నిలిచిపోయే గొప్ప రోజు అని అయోధ్య కేసులో రామ్ లల్లా తరఫున వాదించిన లాయర్ సీఎస్ వైద్యనాథన్ అన్నారు.రామ్‌లల్లా విరాజ్‌మాన్ రాముడి విగ్రహం ఈ కేసులో పిటిషనర్‌గా ఉంది. వివాదాస్పదంగా మారిన భూమిపై రాముడి విగ్రహంకు ఉన్న హక్కులను గురించి కూడా సుప్రీం కోర్టు గతంలో ప్రస్తావించింది. ఆలయాలు, లేదా అందులో ఉన్న దేవుడి విగ్రహాల తరపున ట్రస్టీలు ఉండొచ్చని చట్టంలో ఉంది. అయితే ఆలయాలు వాటి ఆస్తులను చాలా సందర్భాల్లో ట్రస్టీలే నిర్వహిస్తూ ఉంటారు.

అంటే అయోధ్య కేసులో కూడా డీడ్ విగ్రహంపైనే ఉంటుందనేది స్పష్టమవుతోంది. అందుకే కేసులో పిటిషనర్‌గా విగ్రహం కూడా ఉంది. ఇక అయోధ్య కేసులో రామ్‌లల్లా మైనర్‌గా చూస్తున్న నేపథ్యంలో గార్డియన్‌ ఈ కేసులో కోర్టుకు హాజరవుతూ వచ్చారు. ఈ కేసులో విజయం తనది కాదని, ఇది చట్టం సాధించిన విజయమని ఆయన చెప్పారు. అన్ని పక్షాలకూ న్యాయం చేసేలా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని వైద్యనాథన్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఐక్యతను కాపాడేలా, ప్రజల మధ్య సోదర భావం కొనసాగేలా ధర్మాసనం బ్యాలెన్స్‌గా వహరించిందన్నారు.

అయోధ్య కేసులో రామ్ లల్లా తరఫు లాయర్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు కేసు విజయంలో కీ రోల్ పోషించాయి.హిందూ చట్టం ప్రకారం విగ్రహాలు కూడా చట్టపరిధిలోకి వస్తాయని ఉంది. ఇందులో భాగంగానే శ్రీరాముడి విగ్రహం కూడా అయోధ్య కేసులో చట్టపరమైన వ్యక్తికిందనే ట్రీట్ చేయడం జరుగుతోంది. హిందూ విగ్రహాలు చట్టపరిధిలోనే ఉంటాయని కోర్టులు గుర్తిస్తున్నాయి. అదే సమయంలో ఈ విగ్రహం బాగోగులు ఎవరైతే చూస్తున్నారో అట్టివారిని గార్డియన్‌ లేదా మేనేజర్‌గా కోర్టులు పరిగణిస్తున్నాయి. ఇక అయోధ్యకేసులోని భూమి శ్రీరాముడికి చెందినది అని తీర్పు రావడంతో ఇప్పుడు దీనికి సంబంధించిన భూమిపై అన్ని హక్కులు ట్రస్టుకు ఉంటాయి.


రామ జన్మభూమిలో పూర్వం మందిరం ఉండేదని బలంగా వాదించడంతో పాటు అందుకు తగిన సాక్ష్యాలను కోర్టు ముందు ఉండడంలో సక్సెస్ అయ్యారు. 40 రోజుల వాదనల్లో ఏనాడూ పట్టుతప్పకుండా నిలబెట్టుకుంటూ వచ్చారాయన. ఎట్టకేలకు శనివారం సుప్రీం తీర్పు రామ్ లల్లాకు అనుకూలంగా వచ్చింది.వివాదాస్పద భూమి రామ మందిర నిర్మాణానికి ఇచ్చిన సుప్రీం కోర్టు.. సున్నీ వక్ఫ్ బోర్డుకు మరోచోట ఐదెకరాల భూమి ఇవ్వాలని తీర్పు చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: