అయోధ్య రామ‌మందిరం... దేశానికి స్వాతంత్రం వచ్చి నలభయ్యేళ్ళ వరకూ ఎవరికీ గుర్తుకురాలేదు. 1949 లో అయోధ్యలో రాముని విగ్రహాని పెట్టి పూజలు చేశాక దానికి తాళాలు వేయించారు నాటి పాలకులు. ఆ మీదట పోరాటాలు లోకల్ గానే సాగాయి. దాన్ని అంతా మరచిపోతున్న వేళ జాతి మొత్తాన్ని ఆ వైపుగా తిప్పి జాతీయ సమస్యగా మార్చిన వారే ఆ ఇద్దరు. వారి వల్లనే ఈ రోజు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కాబోతోంది.


అందులో ఒకరు మొన్ననే  తన 92వ పుట్టిన రోజు జరుపుకున్న బీజేపీ ఉక్కు మనిషి ఎల్కే అద్వాని, అయితే మరొకరు విశ్వహిందూ పరిషత్ వరిష్ట  నాయకుడు అశోక్ సింఘాల్. ఈ ఇద్దరూ చేసిన అనేక పోరాటాల ఫలితంగానే ఇపుడు అయోధ్యలో రాములు వారి ఆలయం కట్టబడుతోంది. విశ్వహిందూ పరిషత్ ఈ సమస్యను మొదట టేకప్ చేస్తే దాన్ని బీజేపీ అందిపుచ్చుకుంది. 1990 ప్రాంతలో బీజేపీకి అయోధ్య రామమందిరమే కీలకమైన అంశమైంది. 


అద్వాని రధయాత్ర ఆ రోజుల్లో దేశాన్ని ఒక వూపు ఊపేసింది. ఇక అద్వాని రెండు సీట్లు ఉన్న బీజేపీని ఏకంగా 161 సీట్లవరకూ పెంచేసిన చరిత్ర వెనక కూడా అయోధ్య ఉంది. ఇక ఈ దేశానికి బీజేపీ నాయకత్వం వహిస్తుందని సంకేతాలు అందించడం  కూడా అయోధ్య బలంతోనే సాధ్యపడింది.  ఇదిలా ఉండగా 1992లో అయోధ్య‌లో బాబ్రీ మసీద్ ని కూల్చివేయడం చరిత్రలో ఒక సంచలన సంఘటన. నాడు దేశం మొత్తం షాక్ తిన్నా ఆ తరువాత పరిణామాలు అక్కడ రాముడి మందిరం నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. బాబ్రీ మసీద్ కేసులో నిందితుడుగా ఉంటూ వచ్చిన అద్వానీ అయోధ్య విషయంలో తాజాగా సుప్రీం కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.


దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మరో పెద్ద ఉద్యయం అయోధ్యలో రామ‌మందిరం కోసం జరిగిందని అద్వానీ అన్నారు. ఈ ఉద్యమంలో పాలుపంచుకోవడం తనకు గర్వకారణమని కూడా ఆయన చెపుకొచ్చారు. మొత్తానికి అశోక్ సిఘాల్ జీవించి లేకున్నా ఆయన్ని కూడా ఈ సందర్భంగా తలచుకోవాల్సిన అవసరం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: