తెలుగుదేశం పార్టీకి అసలైన కష్టాలు రాబోతున్నాయా. ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ ఎదుర్కోని ఘోర సంఘటనలు జరగబోతున్నాయా. అంటే వేగంగా మారుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీలో చంద్రబాబు టీడీపీని ఎవరు టార్గెట్ చేస్తున్నారు, ఎందుకిలా జరుగుతోంది. అసలు బాబు పార్టీపై గురి పెట్టడానికి దారి తీసిన కారణాలు ఏంటి.


వీటిని సమాధానం రెడీగా ఉంది. ఢిలీల్లో బీజేపీ పెద్దాయన అమిత్ షా ఇపుడు ఏపీ మీద ద్రుష్టి పెట్టారట. అయోధ్య అంశం కూడా పూర్తి అయింది. బీజేపీ నేతలు దాదాపుగా ఖాళీగా ఉన్నారు. దాంతో ఏపీలో టీడీపీ భరతం పట్టడానికి పెద్ద ఎత్తున స్కెచ్ వేసినట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు పార్టీ నుంచి  మొత్తానికి మొత్తం ఎమ్మెల్యేలను హై జంప్ లాంగ్ జంప్ చేయించడానికి రంగం సిధ్ధమైపోయిందిట‌. ఏపీలో అసెంబ్లీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కానీ ఇపుడు పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు పుట్టుకువస్తున్నారు. వారంతా పసుపు శిబిరం నుంచే వస్తారట. వారిలో వల్లభనేని వంశీ, గంటా శ్రీనివాసరావులతో పాటు, గుంటూర్, ప్రకాశం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉంటారట. ఒక్కసారిగా ఎమ్మెల్యేలను కూడగట్టి  అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు బీజేపీ పెద్దలు స్కెచ్ రూపొందించారట.


ఏపీ అసెంబ్లీలో మూడవ వంతు విడిపోతే వారి మీద అనర్హత వేటు ఉండదు. దాంతో ఆ దిశగా పెద్ద ఎత్తున కసరత్తుతో పాటు ఆలోచనలు  చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికైతే తొమ్మిది మంది వరకూ టీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది. కనీసంగా డజను మందికి పైగా ఎమ్మెల్యేల్ను పోగు చేస్తే గోవా మాదిరి ఆపరేషన్ మొదలుపెట్టి ఏపీలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించేందుకు సీన్ రెడీ చేసిపెట్టుకున్నారట. మొత్తానికి బాబుకి నవంబర్ గండం పొంచి ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: