యూటర్న్ బాబు అని చంద్రబాబుకు ఎవరు ఏ సమయంలో పేరు పెట్టారో కానీ.. ఆయన దాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎన్నికల ముందు వరకూ బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే బీజేపీతో స్నేహం కోసం అర్రులు చాస్తున్నారు. కమలం పార్టీతో పొత్తుకోసం బాబు ఆరాటం చూస్తుంటే పాపం ఆయన అభిమానులకు గుండె తరుక్కుపోతుంది.


ఇప్పుడు మోదీ ఏం చెప్పినా నిజమే అంటున్నాడు చంద్రబాబు. బీజేపీ ఏం చేసినా కరెక్టే అంటున్నాడు. అసలు కాషాయంతో నాకేం పేచీ లేదే అని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడు. ప్రధాని ప్రాపకం కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. 2018 లో ఏపీలో కాలు పెట్టుకుండా చేస్తామన్న మోదీ కాళ్లుపట్టుకోడానికి కూడా చంద్రబాబు సిద్ధమైపోయాడని రాజకీయ ప్రత్యర్థులు మండిపడుతున్నారు.


పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్లి, చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, మౌనంగా శ్మశానం వైపు నడిచిన చందమామ కథలాగానే ఉంది చంద్రబాబు కథ కూడా. పట్టుతప్పిన అక్రమార్కుడు బీజేపీ వద్దకు తిరిగి వెళ్లి, మోదీ ప్రాపకం సంపాదించి, ఓటుకు నోటు మొదలు లాండ్ మైన్ లాంటి కేసులపై స్టే ఎత్తివేయకుండా కాపాడమని, కాళ్లమీద పడుతున్న చంద్రబాబు కథ ఇప్పుడు చూడాల్సి వస్తోంది.


మల్లెపూలు మొదలు మొగలి పూల వరకూ పూలగుత్తులు పంపుతున్నా ఫలితం ఉండట్లేదు. చెడ తిట్లు తిట్టిన నోటితోనే పొగుడుతూ ప్రస్తుతిస్తున్నా మోదీ పక్కన చేరే సందు దొరకడం లేదు. చివరకి తాను ముఖ్యమంత్రి కాదన్న సంగతే మర్చిపోయి ప్రధాని గారూ శ్వేతపత్రం ఇస్తా నన్ను కాస్త రానీండని సాష్టాంగపడిపోతున్నా.. ఆ పక్క నుంచి పిలుపు రావడం లేదని వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు. పాపం.. అలా చంద్రబాబుకు కష్టకాలం నడుస్తోంది మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: